‘టికెట్’ ఫీజు..మెలిక పెట్టిన రేవంత్. .పోటీ తగ్గుతుందా?

TS Politics: CM Revanth Reddy took a sensational decision on the budget
TS Politics: CM Revanth Reddy took a sensational decision on the budget

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చే విషయంలో కొత్త పంథాలో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. అధిష్టానం సీట్లు ప్రకటించాలంటే ప్రతి సారి సీనియర్ నేతలు రికమండేషన్ చేయవలసి వచ్చేది. సీట్లు దక్కని వారు లొల్లి లొల్లి చేసేవారు. దీని వల్ల పార్టీకి నష్టం జరిగేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త రూట్ లోకి వచ్చింది.

సీటు ఆశించే వారు..ఫీజు కట్టి దరఖాస్తులు పెట్టుకోవాలని రూల్ పెట్టారు. అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేయాలనుకునే వాళ్ల నుంచి దరఖాస్తులను టీపీసీసీ స్వీకరించనుంది. తాజాగా దరఖాస్తుల ఫాంను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, విడుదల చేశారు. ఇక డబ్బు కట్టి అసెంబ్లీ సీటు ఆశించే వారు దరఖాస్తు పెట్టుకోవాలి. ఇక ఎస్సీ, ఎస్టీ ధరఖాస్తుదారులకు రూ.25 వేలు, బీసీ, ఓసీలకు 50 వేల రూపాయల ధరఖాస్తు రుసుముగా ఖరారు చేశారు.

ఇక ఇక్కడ రేవంత్ కొత్త మెలిక పెట్టారు. సీటు దక్కని వారికి మళ్ళీ దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదని.. ఇక ఈ నెల 25 తర్వాత దరఖాస్తులను స్క్రూటీని చేస్తామని, సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాలను అంచనా వేసి స్క్రీనింగ్ కమిటీకి నివేదిక ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ…బలమైన అభ్యర్ధులని ఇద్దరు లేదా ముగ్గురిని ఫిక్స్ చేసి..చివరిగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. అప్పుడు సెంట్రల్ కమిటీ ఫైనల్ గా అభ్యర్ధులని విడుదల చేస్తుందట.

అయితే ఎవరైనా పార్టీలో చేరి టిక్కెట్ అడిగితే పీఏసీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇలా కాంగ్రెస్ లో కొత్త ఫార్ములాకు తెరలేపారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.