Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు చివరికి ఆయన మెడకే చుట్టుకోనున్నాయా ? ఆయనకీ వంత పాడుతున్న పాపానికి ఐవైఆర్ కృష్ణారావుకూ కటకటాలు లెక్కించక తప్పని పరిస్థితి ఉందా? ఈ ప్రశ్నలకు న్యాయ నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. చంద్రబాబుని ఇరుకున పెట్టాలని వీరిద్దరూ చేస్తున్న ఆరోపణలు చివరకు వీరి మెడకే చుట్టుకొనున్నాయన్నని తెలుస్తోంది. జెనీవాలో వేలం వేశారంటున్న వజ్రం తిరుమల శ్రీవేంకటేశ్వరుడిదే అయితే… నాటి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుతో పాటు టీటీడీ మాజీ ఈవో ఐవైఆర్ కృష్ణారావులను అరెస్టు చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ డీవీ రావు అన్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి చెందిన పింక్ డైమండ్ ను జెనీవాలో వేలం వేశారనే వార్త నిజమైతే… అప్పట్లో ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులుతో పాటు అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్ కృష్ణారావును కూడా అరెస్ట్ చేయాలని అలాగే డైమండ్ విదేశాలకు తరలిపోయేలా కస్టమ్స్ అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
విజయవాడలో మాట్లాడిన ఆయన అర్చకులు కారుణ్య నియామకాలను కోరడంలో తప్పు లేదని… కానీ, రిటైర్మెంట్ తర్వాత వంశపారంపర్యంగా కోరడం సరికాదని చెప్పారు. టీటీడీలో పదవీ విరమణ వయసుకు సంబంధించి గతంలోనే హైకోర్టు తీర్పునిచ్చిందని అన్నారు. 1987, 2012లలో జారీ అయిన జీవోలను ఇప్పుడు సవాల్ చేసే అవకాశమే లేదని చెప్పారు. ఆ జీవోల ప్రకారం 2013లో చాలా మంది రిటైరయ్యారని తెలిపారు. 2001లో గరుడసేవలో తన సమక్షంలోనే పింక్ డైమండ్ పగిలిందని రమణ దీక్షితులు చెప్పారని… పగిలింది డైమండ్ కాదు, రూబీ అని అప్పటి ఈవో ఐవైఆర్ నివేదిక ఇచ్చారని డీవీ రావు అన్నారు. జగన్నాథరావు కమిటీ కూడా ఆ నివేదికను సమర్థించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో, జెనీవాలో వేలం వేసింది శ్రీవారి వజ్రం అని రమణ దీక్షితులు ఇప్పుడు చెబుతుండటంపై ఎవరైనా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే… రమణ దీక్షితులతో పాటు ఐవైఆర్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అన్నారు.
2001లో గరుడసేవలో తన సమక్షంలోనే పింక్ డైమండ్ పగిలిందని రమణ దీక్షితులు అంటున్నారని కానీ పగిలింది డైమండ్ కాదు, రూబీ అని అప్పటి ఈవో ఐవైఆర్ నివేదిక ఇచ్చారని డీవీ రావు అన్నారు. జగన్నాథరావు కమిటీ కూడా ఆ నివేదికను సమర్థించిందని ఈ నేపథ్యంలో, జెనీవాలో వేలం వేసింది శ్రీవారి వజ్రం అని రమణ దీక్షితులు ఇప్పుడు చెబుతుండటంపై ఎవరైనా తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే… రమణ దీక్షితులతో పాటు ఐవైఆర్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అంటే వారు చేస్తున్న ఆరోపణలు నిజమే అయితే అప్పట్లో స్వామి సేవలో ఉన్న వీరిద్దరూ వజ్రం మాయం కావడానికి బాధ్యత వహించాల్సిందే అన్నది ఆయన చెప్పకనే చెబుతున్నారు. వాటిని సంరక్షించాల్సిన పని చేయకుండా తీరిగ్గా ఇప్పుడొచ్చి అప్పుడు అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టడం చెల్లదని ఆయన స్పష్టం చేస్తున్నారు.