Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈవెంట్లు ఉన్నాయని భారీ మొత్తంతో ఒప్పందం చేసుకుంటాడు, అమెరికా రమ్మంటూ తానే టికెట్ లు వేసి మరీ ఫ్లైటెక్కిస్తాడు. తీరా అక్కడికెళ్లాక నిర్భందించి వ్యభిచార కూపంలోకి నెడతాడు. ఇది ఓ టాలీవుడ్ చోటా నిర్మాత అమెరికాలో చేస్తున్న దౌర్భాగ్యపు పని. చేసిన పాపం ఊరికే పోదంటారు పెద్దలు అందుకే సదరు వ్యక్తి నడిపిన చీకటి యవ్వారాలు అన్నీ ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళాయి. పక్కా సమాచారంతో దాడి చేసి నిర్మాతతో పాటూ అతడికి సహకరిస్తూ ఈ వ్యభిచార దందాను నడుపుతున్న భార్యను కూడా అరెస్ట్ చేశారు.
చికాగో పోలీసులు అకడి కోర్టుకు సమర్పించిన వివరాల మేరకు.. కిషన్ అలియాస్ రాజు అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి అనే చాలా సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. తర్వాత అమెరికాలోని చికాగాలో సెటిలయ్యారట. తన భార్యతో కలిసి గత కొంతకాలంగా ఈ రాకెట్ నడిపిస్తున్నారనీ, హీరోయిన్లను డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లకు పంపే కిషన్, చంద్రలు, వారివద్దకు కస్టమర్లను తీసుకెళ్లేవారని, స్వల్ప సమయం వారితో గడిపేందుకు విటుల నుంచి 3 వేల డాలర్స్ వసూలు చేసేవారనీ పోలీసులు కోర్టుకు సమర్పించారు. దీంతో ఏప్రిల్ లోనే భార్యాభర్తలిద్దరినీ అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి మరిన్ని వివరాల కోసం వారివద్ద విచారణ జరుపుతున్నారు.
క్రిస్మస్ సంద్భంగా గతేడాది ఓ యువ హీరోయిన్ను అమెరికాకు రప్పించి వ్యభిచారం నిర్వహించడంతో విషయం బయటపడింది. తనను వేధించవద్దని, తనకు ఎలాంటి హానీ చేయవద్దని ఆ యువ హీరోయిన్ రాసిన ఈ-మెయిల్ ఆధారంగానే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించినంతవరకు ఆ హీరోయిన్ను.. ఫెడరల్ పోలీసులు బాధితురాలిగానే చూస్తున్నారు. ఆమెను `విక్టిమ్-ఎ`గా పేర్కొంటున్నారు. ఇలా మెయిల్ ద్వారా ఈ హైటెక్ సెక్స్ రాకెట్ బయటపడగా.. పోలీసులు రాజు ఇంటిపై దాడులు జరిపారట. అక్కడ కొన్ని వస్తువుల్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులోని ఒక బ్యాగ్లో ఏకంగా డెబ్బై కి పైగా కండోంలు కూడా దొరికాయట.