వర్ధమాన మ్యూజిక్ డైరెక్టర్, జూనియర్ ఆర్టిస్ట్ అనురాగ్ ఆత్మహత్య కు పాల్పడ్డాడు. అయితే వారం రోజుల కిందట అనురాగ్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. అతడు ఆత్మహత్య చేసుకున్న స్థలం, వివరాలపై భిన్న కథనాలు వెలుగు చూస్తున్నాయి. నాగోల్ మమత నగర్ లో ఆత్మహత్య చేసుకున్నారని, అలాగే వికారాబాద్ సమీపంలోని మర్పల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఆత్మహత్య మీద అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. గత కొంతకాలం నుంచి అనురాగ్ ను కొంతమంది నుంచి వేధింపులకు గురయ్యాడని డ్రగ్స్ కు బానిస కావడం వలన ఎవరు లేని సమయంలో ఆమత్తులో సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. పలు షార్ట్ఫిల్మ్స్లకు అనురాగ్ పని చేశాడు. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా జరగడంతో అతడి కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది. కుటుంబసభ్యులు ఈ ఆత్మహత్య వెనకున్న వివరాలు తెలిపేందుకు నిరాకరిస్తున్నారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 9వ తేదీన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనురాగ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.