ప్రస్తుతం కరోనా కారణంగా లాక్డౌన్ పాటిస్తుండడంతో సినిమా షూటింగ్లన్ని ఆగిపోయాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల గ్యాప్ తరువాత సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వడం, వరుస పెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫ్యాన్స్ సంబరపడిపోయారు. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్తో పాటు క్రిష్ దర్శకత్వంలో రాబిన్ హుడ్ కాన్సెప్ట్‌తో హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే పవన్ క్రిష్ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ భామ జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను తీసుకున్నారని, ఈ సినిమా కోసమే ఆమె హైదరాబాద్ వచ్చి క్రిష్‌ను కూడా కలిసిందని కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకు హీరోయిన్గా అనుష్కను తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం జాక్వలైన్ని తీసుకుంటున్నారా లేక ఆమె స్థానంలో అనుష్కను తీసుకుంటున్నారా లేక ఇద్దరి తీసుకుంటారా అనే దానిపై మాత్రం చిత్ర బృందం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఒక వేళ పవన్ సరసన కనుక అనుష్క నటిస్తే వీరిద్దరి జోడీ, కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఇప్పటి నుంచి ఊహాగానాలు మొదలెడుతున్నారు.