ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం కరోనా కేసులు

కరోనా వైరస్‌ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ప్రతి పదిలక్షల జానాభాకుగాను ఏపీ ప్రభుత్వం 331కి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16555 పరీక్షలు చేపట్టింది. ఈ జాబితాలో రాజస్తాన్‌ (549), కేరళ (485), మహారాష్ట్ర (446) తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో మిలియన్‌ జనాభాకు సగటున 198 పరీక్షలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో 331 మందికి చేస్తున్నారు. గుజరాత్, తమిళనాడుల కంటే ఏపీ ముందు స్థానంలో నిలవడం గమనార్హం. (ఏపీలో కొత్తగా 38 కరోనా కేసులు)

వైరస్‌ తీవ్రత పెరుగుతుండటంతో రోజుకు 90 టెస్టుల స్థాయి నుంచి 3వేలకు పైగా టెస్టులు చేసే స్థాయికి సామర్థ్యాన్ని పెంచుకున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా కరోనా కట్టడికి ప్రభుత్వం తొలినుంచి కఠిన చర్యలు అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 572కి చేరింది.