ఇక పెళ్లికి రెడీ.. వరుడు కూడా రెడీ

trisha getting ready for marriage

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

తెలుగు ప్రేక్షకులను సుదీర్ఘ కాలం ఎంటర్‌టైన్‌ చేసిన హీరోయిన్స్‌ జాబితాలో ముందు ఉండే పేరు త్రిష. ఈమె సుదీర్ఘ కాలంగా తెలుగు మరియు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఆమె వచ్చిన అవకాశాలు కూడా అంతగా సక్సెస్‌ కావడం లేదు. దాంతో త్రిష ఇక సినిమాలకు గుడ్‌ బై చెప్పేయాలనే నిర్ణయానికి వచ్చింది. అతి త్వరలోనే ఈమె బిజినెస్‌మన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తున్న త్రిష దాన్ని తన చివరి సినిమా అంటూ ప్రచారం చేసుకుంటున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలోనే త్రిష వివాహ నిశ్చితార్థం అయిన విషయం తెల్సిందే. రాహుల్‌ అనే వ్యక్తితో త్రిష వివాహ నిశ్చితార్థం జరిగింది, త్వరలో పెళ్లి అనుకుంటున్న సమయంలో షాకింగ్‌గా పెళ్లి క్యాన్సిల్‌ చేసుకుంటున్నట్లుగా ఇద్దరు వేరు వేరుగా మీడియా ప్రకటనలు విడుదల చేశారు. వారిద్దరు ఎందుకు విడిపోయారు అనే విషయం ఇప్పటికి తెలియలేదు. అయితే రాహుల్‌కు త్రిష సినిమాల్లో నటించడం ఇష్టం లేదని, అందుకే పెళ్లి తర్వాత సినిమాలు మానేయాల్సిందిగా కోరాడట. అందుకు నో చెప్పిన త్రిష, అసలు పెళ్లి వద్దంటూ రాహుల్‌ వద్ద చెప్పడంతో పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది. ఇప్పుడు చెన్నైకు చెందిన ఒక పారిశ్రామిక వేత్తతో ఈమె వివాహంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా వీరిద్దరి మద్య అన్యోన్యం ఉందని, తప్పకుండా వీరిద్దరి జంట బాగుంటుందనే అభిప్రాయం తమిళ మీడియాలో వ్యక్తం అవుతుంది. ఈసారి అతడు కోరకుండానే సినిమాలు మానేయాలని త్రిష నిర్ణయించుకుంది. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టే ఆలోచనలో కూడా త్రిష ఉందంటూ ప్రచారం జరుగుతుంది.