లియో సినిమాలో హీరోయిన్ త్రిషను రేప్ చేసే సీన్ లేకపోవడంతో బాధపడ్డానన్న నటుడు మన్సూర్ ఆలీఖాన్ వాక్యాలపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది . హీరోయిన్ మాళవిక మోహన్, సింగర్ చిన్మయి, నిర్మాత అదితితో పాటు పలువురు నటీమణులు, దర్శకులు అతని కామెంట్స్ ని ఖండించి, త్రిషకు మద్దతుగా నిలిచారు. అలీఖాన్ వాక్యాలు అతడి నీచపు సాంస్కృతికి నిదర్శనం అని మండిపడ్డాడు . మన్సూర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు .
ఇక… ఈ సంఘటనపై చిరంజీవి గారు కూడా స్పందిచారు. తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ హీరోయిన్ త్రిషపై చేసిన వివాదాస్పద వాక్యాలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. ‘త్రిషపై నటుడు మన్సూర్ చేసిన అసభ్యకర వాక్యాలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటివి ఒక ఆర్టిస్ట్ నే కాదు…. ఏ స్త్రీని అనకూడదు. వక్రబుద్ధితోనే ఇలా మాట్లాడుతున్నారు. త్రిష కు మాత్రమే కాదు. ఇలాంటి వాక్యాలు ఏ అమ్మాయిపై చేసినా నేను అండగా ఉంటా’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.