Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు బయటికి వచ్చాయి. అందులో ఎన్టీఆర్ మిలిటరీ మ్యాన్ అని ఓ సారి డిటెక్టివ్ అని ఇంకోసారి పుకార్లు షికార్లు చేశాయి. ఇక ఇందులో సీనియర్ నటి టబు ముఖ్య పాత్ర చేస్తున్నట్టు కూడా ఊహాగానాలు వచ్చాయి. ఇక సినిమా యాక్షన్ ఓరియెంటెడ్ అని కూడా చెప్పుకున్నారు. అయితే అందులో నిజం లేదని దర్శకుడు త్రివిక్రమ్ స్పష్టం చేశారు. తాను తీయబోయే సినిమా కుటుంబ కధా చిత్రమని చెప్పేసారు. అటు టబు కూడా ఇంకా కొత్త సినిమా ఒప్పుకోలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా టైటిల్ గురించి కూడా ఎన్నో కబుర్లు బయటికి వచ్చాయి. సోల్జర్ లేదా రాముడు భీముడు టైటిల్స్ మీద పెద్ద చర్చ సాగింది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి సరికొత్త రకమైన పేరు పెడుతున్నట్టు తాజా టాక్. ఈ సినిమా చేస్తున్న హారిక అండ్ హాసిని సంస్థ “ ఆన్ సైలెంట్ మోడ్ “ అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ ఎన్టీఆర్ సినిమా కోసమే అన్న పుకార్లు ఇప్పుడు ఫిలిం నగర్ లో గుప్పుమంటున్నాయి. ఈ సినిమా మీద ఎన్ని పుకార్లు వచ్చినా మౌనంగా వున్న ఎన్టీఆర్ కి నిజంగానే ఈ టైటిల్ భలేగా సరిపోతుంది అనిపిస్తోంది. అయితే ఈ కొత్త తరహా టైటిల్ మీద తారక్ ఫాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.