Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సెంటిమెంట్లు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. కొందరు కొన్ని కలాలను జీవితకాలం దాచుకుంటారు. మరికొందరు కొన్ని పుస్తకాలను, కొన్ని రకాల డ్రెస్సులను, ఇంకొందరు ఫోన్లను, ఉంగరాలను తమ సెంటిమెంట్ గా భావిస్తుంటారు. ఈ సెంటిమెంట్లకు సెలబ్రిటీలేం అతీతులు కాదు. ఇంకా చెప్పాలంటే వాళ్లకు ఇంకొంచెం ఎక్కువమోతాదులోనే ఉంటాయి. ముఖ్యంగా సినిమా వాళ్లకు ఈ సెంటిమెంట్ల పిచ్చి కాస్త ఎక్కువే. తన మాటలతో మంత్రజాలం చేసే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా దీనికి అతీతం కాదు. సినిమా అవకాశాల కోసం తిరిగే రోజుల్లో తాను నివాసం ఉన్న ఒక గదికి ఇప్పటికీ ఆయన అద్దెకడుతుండడమే ఇందుకు ఉదాహరణ.
అందరిలానే త్రివిక్రమ్ కూడా సినిమాల్లో ఛాన్స్ ల కోసం పడరాని కష్టాలు పడ్డాడు. ఎమ్మెస్సీలో గోల్డ్ మెడలిస్ట్ అయినప్పటికీ ఆకలి బాధలు అనుభవించాడు. పంజాగుట్టలోని సాయిబాబా ఆలయం సమీపంలోని ఒక అద్దె ఇంట్లో ఉంటూ సినిమా సంస్థలు చుట్టూ తిరిగే వాడు. నెమ్మదిగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. తర్వాత తిరుగులేని మాటలరచయితగా. దర్శకుడిగా ఎదిగాడు. త్రివిక్రమే కాదు… ఆ గదిలో ఆయనతో పాటు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, కామెడీ హీరో సునీల్ కూడా ఉండేవారు. వారంతా కూడా సినిమాల్లో సక్సెస్ అయ్యారు. కానీ సునీల్, ఆర్పీ పట్నాయక్ కన్నా ఎక్కువగా త్రివిక్రమ్ ఆ అద్దె గదిపై మమకారం పెంచుకున్నాడు. ఆ గదిని ఆయన సెంటిమెంట్ గా భావిస్తాడు. అగ్రదర్శకుడిగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నప్పటికీ… ఇప్పటికీ ఆ గదికి నెల నెలా..రూ 5వేలు అద్దె కడుతూ తన కిందే ఉంచుకున్నాడు. అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి సరదాగా కాసేపు ఉండడం, కొత్త కథలు, మాటలు అక్కడ మొదలుపెట్టడం వంటివి చేస్తుంటాడు త్రివిక్రమ్. ఆ గది వల్లే తన దశ తిరిగిందని త్రివిక్రమ్ నమ్మకమన్నమాట.