మున్సిపల్ ఎన్నికలలో భారీ మెజారిటీనీ సాధించిన టీఆర్ఎస్కి త్వరలోనే షాక్ తగలబోతుంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీనీ వీడేందుకు రెడీ అవుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో టీఆర్ఎస్ తరుపున గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న జూపల్లి, ఈ సారి జరిగిన ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిపోవడంతో పార్టీలో జూపల్లి హవా తగ్గిపోయింది.
అయితే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో సొంత పార్టీ అభ్యర్థులను కాదని, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన తన అనుచరులకు మద్ధతు తెలపి, వారి కోసం ప్రచారం కూడా నిర్వహించాడు. అయితే మున్సిపల్ ఎన్నికలు ముగిశాక జూపల్లి హైదరాబాద్ వచ్చి కేసీఆర్ని కలవాలని అనుకున్నారు. అయితే రెండు రోజులు వేచి చూసిన కేసీఆర్ అపాయింట్మెంట్ జూపల్లికి దొరకలేదు. అయితే ఆయన ఇక టీఆర్ఎస్ని వీడి సొంత పార్టీ కాంగ్రెస్లో చేరడమే బెటర్ అని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ముందు బీజేపీలోకి వెళ్ళాలని భావించినా జిల్లాలో ఆయన శత్రువుగా భావించే డీకే అరుణ ప్రస్తుతం బీజేపీలో ఉండడంతో ఆయన కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు టాక్.