ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా అధికార తెరాస పార్టీ హవా కొనసాగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మున్సిపాలిటీలో మాత్రం అధికార తెరాస పార్టీ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. కాగా కొత్తగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నప్పటికీ కూడా అందులోని మెజారిటీ స్థానాలను మాత్రం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.
దానికి తోడు కాంగ్రెస్ పార్టీకి సంబందించిన మిత్ర పక్షాలు కూడా విజయాన్ని సాధించాయి. ఇకపోతే రాష్ట్ర ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి సంబందించిన అనుబంధ సభ్యులు 8 స్థానాలు గెలుచుకున్నారు.కానీ అధికార తెరాస మాత్రం కేవలం 3 స్థానాలతో సరిపెట్టుకుంది చెప్పాలి. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక యాదాద్రిని తెలంగాణ తెరాస ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా వరకు అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వారు మెజారిటీ స్థానాలను గెలుచుకోవడం అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.