TRS Ministers Sensational Comments On KCR
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాత్మకంగా చేసే కామెంట్లు కొన్ని స్వంత పక్షానికే ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఏపీలో ఎన్నికల ఫలితాల గురించి కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరమేంటని రెండు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. 2014లో ఇలాగే జోస్యం చెప్పి కంగుతిన్న కేసీఆర్.. మళ్లీ అదే తప్పులో కాలేశారు. ముందు సొంత సర్వే తెలంగాణలో ఎంతవరకూ నిజమవుతుందో క్లారిటీ తెచ్చుకోవాలంటున్నారు ప్రత్యర్థులు.
ముఖ్యంగా ఏపీలో టీడీపీ కేసీఆర్ వ్యాఖ్యలపై రగిలిపోతోంది. అన్నివైపులా ప్రభుత్వ అనుకూలత ఉంటే.. కేసీఆర్ కు మాత్రమే వ్యతిరేకత కనబడిందని సెటైర్లు పడుతున్నాయి. జగన్ ఇంకా వ్యూహాల్లో బాబుకు ఆమడ దూరంలో ఉన్నారు. వారిద్దరి మధ్య ఈసారి కనీస పోటీ కూడా ఉండదనే మాట వినిపిస్తోంది. అలాంటి సమయంలో కేసీఆర్ చెప్పిన వివరాలు పూర్తిగా ఆయన్ను అపహాస్యం చేసేలా ఉన్నాయి.
టీడీపీకే ఏపీలో అడ్వాంటేజ్ ఉందని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. అలాంటిది జగన్ అధికారంలోకి వస్తారని ఎలా చెబుతారని టీడీపీ మంత్రులు తమ పాత స్నేహితుల్ని ప్రశ్నించారట. దీంతో కంగుతిన్న గులాబీ మంత్రులు తమ బాస్ చెప్పిన మాటలకు తమకేం సంబంధమని, ఆయనకు ఏ మిత్రుడు సర్వే చేసి చెప్పాడో తమకు తెలియదని సమాధానమిచ్చారట.