టీఆర్ఎస్ వారసత్వ పోరు పార్ట్ -2

TRS succession War Part2 In TRS

TRS succession War Part2 In TRS

టీఆర్ఎస్ లో కేసీఆర్ చక్రం తిప్పినన్నాళ్లూ హరీష్ ఆయన వెంటే ఉంటారు. నో డౌట్. కానీ ఉద్యమ సమయంలో సడెన్ గా దూసుకొచ్చిన కవిత, కేటీఆర్ పై మాత్రం ఆయనకు చాలా సందేహాలున్నాయి. ఎంతో కష్టపడి క్యాడర్ తో పరిచయం పెంచుకుని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసిన హరీష్ ను వదిలేసి, కేసీఆర్ తన బిడ్డలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయంలో గులాబీ నేతలకు అనుమానాల్లేవు. కానీ ఇఫ్పుడు టీఆర్ఎశ్ లో కొత్త వారసత్వ పోరు షురూ అయిందనే మాట వినిపిస్తోంది.

కేసీఆర్ సీఎం అయ్యాక కేటీఆర్ వర్సెస్ హరీష్ గా సాగిన వర్గపోరులో కేటీఆర్ దే పైచేయిగా కనిపిస్తోంది. వ్యూహాత్మకంగా హరీష్ ను సైడ్ చేసిన కేసీఆర్.. కుమారుడికి అందలం కట్టబెట్టారు. అదేమంటే బాగా పనిచేస్తున్నాడని, జీహెచ్ఎంసీ ఎలక్షన్లను సాకుగా చూపించారు. మరి మిగతా ఎన్నికలన్నింటిలో పార్టీని గెలిపించిన హరీష్ కు మాత్రం మొండిచేయి చూపించారు.

కానీ కేటీఆర్ హరీష్ పై పైచేయి సాధించినా.. సోదరి కవిత నుంచి మాత్రం గట్టి పోటీ తప్పేలా లేదు. కేసీఆర్ కు కేటీఆర్ కంటే కవితే దగ్గరని చెబుతున్నారు. ఆమె ఏం చేయమన్నా ఆయన వెనుకడారనే వాదన ఉంది. ఇప్పటికే ఎంపీగా ఢిల్లీలో ప్రూవ్ చేసుకున్న కవిత, ఎమ్మెల్యేగా హైదరాబాద్ లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీకి దిగుతారట. అదే జరిగితే కేటీఆర్ సీటు కిందకు నీళ్లొస్తాయనే మాట వినిపిస్తోంది.