Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత్ లో అమెరికా కొత్త రాయబారిగా కెన్నత్ జస్టర్ పేరు నామినేట్ చేస్తున్నట్టు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కెన్నత్ జస్టర్ పేరును జూన్ లోనే వైట్ హౌస్ సిఫార్సు చేసినా…మూడు నెలల తర్వాత అధ్యక్షుడు ఖరారు చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతం కెన్నత్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో ట్రంప్‌కు డిప్యూటీ అసిస్టెంట్‌గా ఉన్నారు. దాంతోపాటు అమెరికా నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భారత్ కు సంబంధించిన వ్యవహారాల్లో కెన్నత్ కు బాగా పట్టుంది. అందుకే ట్రంప్ ఆయన్ను నామినేట్ చేశారు. భారత్ లో అమెరికా రాయబారి పదవి ఈ ఏడాది జనవరి నుంచి ఖాళీగా ఉంది. ఇంతకుముందు ఈ పదవిలో పనిచేసిన భారత సంతతి అమెరికన్ అయిన రిచర్డ్ వర్మ జనవరిలో రాజీనామా చేయటంతో ఈ పదవి ఖాళీ అయింది.
రిచర్డ్ వర్మను మాజీ అధ్యక్షుడు ఒబామా నియమించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రిచర్డ్ వర్మ రాజీనామా చేశారు. ప్రస్తుతం మేరీ.కె. ఎల్ కార్ల్ సన్ ఆపద్ధర్మ రాయబారిగా పనిచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల తర్వాత ఆప్ఘనిస్థాన్ పై తన వైఖరి ప్రకటించిన ట్రంప్ ఆ సమయంలో భారత్ తో తమ బంధాన్ని మరింత బలపర్చుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే భారత వ్యవహారాలపై పట్టున్న కెన్నత్ ను రాయబారిగా పంపాలని నిర్ణయించారు.
మరిన్ని వార్తలు: