అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై రోజుకో రకంగా విరుచుకు పడుతూనే ఉన్నారు. హాంగ్‌కాంగ్‌కు అమెరికా కల్పిస్తున్న ప్రత్యేక అధికారాలను తాజాగా రద్దు చేయనున్నట్లు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హాంగ్‌కాంగ్ భద్రత బిల్లుకు చైనా ఆమోదం తెలిపిన ఈ తరుణంలో చైనా తీరు పట్ల అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.
అదే విధంగా హాంగ్‌కాంగ్‌ను చైనా ఆధీనంలోకి తీసుకుంటున్న తీరును ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అందులో భాగంగా అమెరికా వర్సిటీల్లో చేరే చైనా విద్యార్థులను అడ్డుకోనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. వివాదాస్పదంగా మారిన హాంగ్‌కాంగ్ సెక్యూర్టీ చట్టం పట్ల అమెరికా.. బ్రిటన్ దేశాలు యూఎన్ భద్రతా మండలిలో నిరసన వ్యక్తం చేశాయి. ఈ విషయంలో చైనా జోక్యం చేసుకోవడం వల్ల హాంగ్‌కాంగ్ హోదాకు విఘాతం ఏర్పడుతున్నదని ట్రంప్ తీవ్ర ఆరోపనాస్త్రాలు సంధించారు. కాగా ఇది హాంగ్‌కాంగ్ ప్రజలకు విషాదకరమైన పరిణామమనే చెప్పాలి.