Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Trump Issuing Main Jobs To NRI’s
ట్రంప్ చెప్పేదేంటో.. చేసేదేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇండియా నుంచి కొత్తగా ఎవరూ అమెరికా రావద్దని ఇన్ డైరక్టుగా వార్నింగ్ ఇస్తున్న ట్రంప్.. అక్కడే ఉన్న ఎన్నారైలకు మాత్రం మాంచి ఛాన్సులు ఇస్తున్నారు. ఇప్పటికే నిక్కీహేలీకి ఐరాసలో దౌత్యవేత్త హోదా ఇస్తే.. ఇప్పుడు మరో ముగ్గురికి కీలక పదవులు దక్కాయి.
మేథోహక్కుల సంపత్తి అమలు సంస్థ సమన్వయకర్తగా విశాల్ అమీన్, ఫెడరల్ ఎనర్జీ రెగ్యులరేటరీ కమిషన్ సభ్యుడిగా నీల్ ఛటర్జీ, పెరూలో యూఎస్ రాయబారిగా కృష్ణ నియమితులయ్యారు. వీరి పోస్టింగులకు సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం మరింత ఆసక్తికరంగా మారింది.
ట్రంప్ ప్రచార బృందంలో కూడా మొదట్నుంచీ ఎన్నారైలే కీలక పాత్ర పోషించారు. మరి ఇంతమంది ఎన్నారైలుండీ వీసాలపై ఎందుకు నోరు మెదపడం లేదన్నది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. మొత్తం మీద ట్రంప్ మనసెరిగి నడుచుకోవడంలో అమెరికన్ల కంటే ఎన్నారైలే ముందున్నారనేది అక్కడి వారి మాట.