TS Politics: సీఎం రేవంత్ తో భేటీ అయిన గ్రేటర్ మేయర్..!

TS Politics: Greater Mayor who met CM Revanth..!
TS Politics: Greater Mayor who met CM Revanth..!

తెలంగాణలో ప్రతిపక్ష BRS స్నేహితులు రేవంత్ రెడ్డిని కలవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలు కొందరు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. మరి కొంత మంది భేటీ అవుతామని ముందే ప్రకటించారు. తాజాగా లిస్టు లోకి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి కూడా చేరారు.

ఈరోజు మేయర్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు చెప్పారు. తర్వాత సీఎంతో సమావేశమైన ఆమె పలు అంశాల మీద చర్చించారు అని తెలుస్తోంది. మేయర్ సీఎం ని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది అయితే సీఎంతో బీఆర్ఎస్ నేతల వరుస భేటీ తో గులాబీ నేతలు లో గుబులు పుట్టిస్తున్నాయి.