తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా డ్రగ్స్ లేకుండా చేయాలని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించడంతో సీఎం ఆదేశాల మేరకు కీలక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 31, జనవరి 01 తేదీలలో పోలీస్ చాలా అలెర్ట్ అయ్యారు. ప్రధానంగా న్యూ ఇయర్ వేళ నార్కోటిక్ పోలీసుల సరికొత్త స్టెప్ వేయనున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోని డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు చేయడానికి తెలంగాణ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకు కొత్త పరికరాలు చేరాయి. వీటితో నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం అరికట్టడమే లక్ష్యం అంటున్నారు నార్కిటిక్ అధికారులు. ఒక్కో కమిషనరేట్ కి 25 చొప్పున డ్రగ్ డిటెక్షన్ పరికరాలు డ్రగ్గర్, అబోట్, ట్రై కమిషనరేట్ పరిధిలో జంక్షన్లో వద్ద డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. డ్రగ్ డిటేక్షన్ పరీక్షలపై పోలీసులకు ఇప్పటికే శిక్షణ పూర్తి అయింది.