టీటీడీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం కలకలం రేపుతూంది. ఆయన త్వరలో జనసేనలో చేరనున్నారని తెలుస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆయనకు చంద్రబాబు సుగుణమ్మ వంకతో టికెట్ ఇవ్వలేమని చెప్పడంతో ఆయన వైసీపీలోకి టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.అయితే ప్రస్తుత ఇంచార్జ్ భూమనను తప్పించి మీకు టికెట్ ఇవ్వడం కుదరదని జగన్ పార్టీ కూడా తేల్చేయడంతో ఇక ఏకైక ప్రత్యామ్నాయమైన జనసేనను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
అందుకే ఈరోజు హైదరాబాద్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో సుధీర్గ సమయం సమాలోచనలు చేసారు. దసరా పండుగ రోజు తన అశేష అనుచర గణంతో తరలివచ్చి చదలవాడ జనసేనలో చేరనున్నారు. స్వతహాగా కాపు వర్గానికే చెందినా బలిజ కులానికి చెందినా వ్యక్తి కావడం, తిరుపతి నియోజకవర్గంలో ఆ వర్గ వోటింగ్ గెలుపోటములు శాసించే స్థాయిలో ఉండడంతో పవన్ ఆయనకు టికెట్ ఓకే చేసినట్టు తెలుస్తోంది.