Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Tulasi Dharma Charan Alliance With Janasena
కన్నా లక్ష్మీనారాయణ…ఇప్పుడు ఏపీ లో బీజేపీ అస్తిత్వం , బీజేపీ లో తన అస్తిత్వం కోసం పోరాడుతున్న నాయకుడుగా చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ లో దాదాపు రెండు దశాబ్దాలకి పైగా బలమైన నేత. కాంగ్రెస్ లో గ్రూప్ వివాదాలు ఏ స్థాయిలో వుంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు మారారేమోగానీ ఎక్కువ సందర్భాల్లో కన్నా మంత్రిగా వుంటూ వచ్చారు. ఇక జిల్లా రాజకీయాల్లోనూ రాయపాటి వంటి బలమైన నేతని ఢీకొని సత్తా చాటగలిగారు. ఇంత సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సీఎం చంద్రబాబు, రాయపాటి తర్వాత కన్నా ఎక్కువగా దృష్టి పెట్టిన రాజకీయ నేత ఎవరో తెలుసా? ఆయనేమీ రాజకీయ ఉద్దండుడు కాదు. వ్యాపార వేత్త మాత్రమే .పైగా కన్నా సొంత సామాజిక వర్గానికి చెందిన వాడు. ఆయనే తులసి రామచంద్ర ప్రభు. ఆయనంటే కన్నాకు ఎందుకు అంత కోపమో చెప్పాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే.
2009 ఎన్నికల్లో కన్నా కాంగ్రెస్ అభ్యర్థిగా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తే ఆయన మీద టీడీపీ నుంచి చుక్కపల్లి రమేష్, పీఆర్ఫీ నుంచి తులసి రామచంద్ర ప్రభు బరిలో నిలిచారు. పెదకూరపాడు నియోజకవర్గంలో వరస విజయాలు సాధించిన కన్నాకు ఈ ఎన్నికలు చుక్కలు చూపించాయి. ప్రత్యర్థులిద్దరు వ్యాపారవేత్తలు కావడం, తులసి రామ చంద్ర ప్రభు తన ఓటు బ్యాంకు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఖర్చు చేయడంతో కేవలం 3 వేల పై చిలుకు మెజారిటీ తో కన్నా ఆ ఎన్నికల్లో బయటపడ్డారు. ఒకప్పుడు తనకి దగ్గర గానే వ్యవహరించిన ప్రభు స్పీడ్ కన్నాని బాగా హర్ట్ చేసింది. అందుకే ఎన్నికలు అయ్యాక ఆయన కూడా తులసి సీడ్స్ కి సంబంధించిన కొన్ని లొసుగుల్ని ఆసరా చేసుకుని చుక్కలు చూపించారు. ఈ ఇబ్బందుల నుంచి అతి కష్టం మీద బయటపడ్డ తులసి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. మళ్లీ 2014 ఎన్నికల ముందు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు.
ఆ పార్టీ టికెట్ దొరక్కపోయేసరికి నిరాశపడ్డారు. ఆ ఎన్నికలతో కాంగ్రెస్ తో పాటు కన్నా ప్రాభవానికి గండి పడింది. దాంతో కన్నా వెంటనే బీజేపీ లో చేరిపోయారు. టీడీపీ నుంచి వేధింపులు లేకుండా ఉండటానికి అదే మంచి మార్గమని భావించారు. అయితే కన్నా నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న తులసి రామచంద్ర ప్రభు మాత్రం ప్రతీకారం తీర్చుకోడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ ని ఢీకొంటున్న జనసేనతో చేతులు కలిపారు. ప్రభు కుమారుడు ధర్మ చరణ్ ని కన్నా మీద పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఈయనకి యుద్ధం చేయాలని వున్నా కన్నా పోటీ చేయడమే ప్రశ్నర్ధాకం.