Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల రాజకీయంలో టీవీ 9 ప్రభావం ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే. న్యూస్ ఛానల్ గా టీవీ 9 ప్రస్థానం ఎప్పటినుంచో మీడియా రంగంలో ఉన్న సంస్థల ఊహలకి అందకుండా సాగింది. ఈ ఛానల్ ఏర్పాటు అయిన దగ్గర నుంచి దాదాపుగా నెంబర్ వన్ స్థానం ఆ సంస్థదే. ఇక మీడియా పరంగాను టీవీ 9 ఆవిర్భావం ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతికి ఎంతగానో దోహదపడింది. మీడియా వేగాన్ని, ప్రభావాన్ని పెంచిన టీవీ 9 అమ్మకం గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తూనే వున్నాయి. అయినా ఎప్పటికప్పుడు అవి ఊహాగానాలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు మాత్రం టీవీ 9 అమ్మకం దాదాపు ఖరారు అయినట్టే అంటున్నారు.
టీవీ 9 ని సొంతం చేసుకోడానికి 500 కోట్ల భారీ ఆఫర్ తో ముందుకు వచ్చిందట రిపబ్లిక్ టీవీ యాజమాన్యం. ప్రధాని మోడీకి అండగా ఉంటున్న రిపబ్లిక్ టీవీ, ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి నేతృత్వంలో ఏర్పాటైంది. ఇందులో ఎంపీ, ఏషియా నెట్ న్యూస్ ఆన్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఓ భాగస్వామి. ఆయన సంస్థ తరపున కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి నిర్వహణ బాధ్యత మాత్రం రిపబ్లిక్ టీవీ కి అప్పగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే రిపబ్లిక్ టీవీ తరహాలోనే టీవీ 9 లో కూడా బీజేపీ అనుకూల కధానాలకి ప్రాధాన్యం ఏర్పడుతుంది.
అయితే టీవీ 9 పరిస్థితుల్ని ఆకళింపు చేసుకున్నవారికి ఇదంత తేలిక కాదని అనిపించడం ఖాయం. టీవీ 9 లో టాప్ చైర్ లో ఉన్న రవి ప్రకాష్ మొదలుకుని కింది స్థాయి జర్నలిస్ట్ దాకా జాగ్రత్తగా గమనిస్తే ఎక్కువ మంది మీద వామపక్ష భావజాల ప్రభావం ఎక్కువ. ఓ ఉద్యోగిగా యాజమాన్యం అప్పగించిన పని పూర్తి చేయడం లో తప్పేముందని పైకి అనుకున్నా రోజువారీగా మనస్సాక్షికి భిన్నంగా పని చేయాల్సిరావడం తేలిక కాదు. అందుకే యాజమాన్యం మారినంత తేలిగ్గా టీవీ 9 లో బీజేపీ భజన చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇందుకోసం కొన్ని యుద్ధాలు, ఇంకొన్ని త్యాగాలు తప్పవు.
మరిన్ని వార్తలు