చిన్నారి పెళ్లికూతురు అదృశ్యం వెనుక రహస్యం.

tv actress avika gor wanted quit acting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

చిన్నారి పెళ్లికూతురు గా తెలుగు టీవీ ప్రేక్షకుల మదిని దోచిన నటి అవికా గోర్ వెండితెరపై కూడా మెరిసిపోయారు. ఆమె తెలుగులో చేసిన సినిమాల్లో ఎక్కువ భాగం హిట్ అయ్యాయి. అయితే కొన్నాళ్లుగా ఆమె టాలీవుడ్ లో కొత్త సినిమా ఒప్పుకోలేదు. అసలు ఎక్కడా బయటకు రావడం లేదు. దీంతో అవికా గోర్ అదృశ్యం మీద భిన్న కధనాలు వినిపించాయి. అయితే అవన్నీ వట్టిదే అని తేలింది. ఇన్నాళ్లు తాను బయటకు రాకపోవడానికి కారణంతో పాటు ఓ సంచలన ప్రకటన కూడా చేసింది. ఇకపై నటనకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టు అవికా గోర్ చెప్పింది.

avigor

నటనకు గుడ్ బై కొట్టే ఆలోచనలో వున్న అవికా కొత్త కెరీర్ మీద ఫుల్ క్లారిటీతో వుంది. దర్శకత్వం వహించాలని టార్గెట్ పెట్టుకున్న అవికా అందుకు అవసరమైన కసరత్తు, శిక్షణ కారణంగా ఇన్నాళ్లు బయటకు రాలేదట. ప్రస్తుతం ఓ హిందీ సీరియల్ మాత్రమే చేస్తున్న అవికా అది పూర్తి అయ్యాక పూర్తిగా డైరెక్షన్ మీద దృష్టి పెట్టబోతున్నారు.

avika