ట్విట్టర్ పేరు ట్విట్టర్ X, లోగో మార్పుతో భారీ నష్టం..! దారుణంగా యాప్ డౌన్‌లోడ్స్…

Elon Musk
Elon Musk

మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌‌ఫామ్ అయిన ట్విట్టర్లో గత కొన్ని రోజులుగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మొత్తం పవర్ ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లాక వివాదాలు పెరుగుతూ వచ్చాయి. అయితే అన్నింటినీ ఒక దాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ వచ్చిన మస్క్.. ట్విట్టర్లోనూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే కొత్తలో కొన్ని అకౌంట్లను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. పారదర్శకత తమకు ముఖ్యమని,ఫేక్ అకౌంట్లను అస్సలు సహించబోమని తేల్చి చెప్పారు. అయితే ఆ వెంటనే కొత్తగా Twitter Blue టిక్ మార్క్ సబ్‌స్క్రిప్షన్ జోడించారు. దీని కోసం యూజర్లు ప్రతి నెలా కొంత డబ్బు చెల్లించాలనే నిబంధన కూడా తీసుకొచ్చారు.

భారీగా పడిపోయిన డౌన్‌లోడ్స్..

ఇదిలా ఉండగా.. ఇటీవలే ట్విట్టర్ పేరును సైతం మార్చేశారు. గత నెలలో ట్విట్టర్ కంపెనీ తన పేరు ‘X’గా మార్చుకున్నట్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత పాత లోగోను సైతం తొలగించారు. తన మొండి నిర్ణయంతో ముందుకెళ్లాడు. దీంతో తన నిర్ణయానికి ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ఇటీవలే డౌన్‌లోడ్లు భారీగా తగ్గిపోయాయి.

కొంచెం కష్టంగా..

కొందరు వ్యక్తుల అభిప్రాయం ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్, లోగో మార్పు వల్ల ఈ యాప్‌ను గుర్తించడం కొంత కష్టంగా మారింది. చాలా మంది ట్విట్టర్ కొత్త పేరు, లోగోను గుర్తించలేకపోతున్నారు. ప్రపంచమంతా గత దశాబ్ద కాలంగా ఈ యాప్‌ను బ్లూ బర్డ్, ట్విట్టర్ అని పిలుస్తోంది.

ఆగస్టులో పతనం ప్రారంభం..

జూలై 31వ తేదీ వరకు వీటి సంఖ్య బాగానే ఉంది. అయితే కేవలం నెలలోపే పేరు, లోగో మార్చబడింది. అప్పటి గ్రాఫ్‌లో డౌన్ ఫాల్ పెరిగింది. ఇదంతా ఆగస్టు 1 నుంచి ప్రారంభమైంది. చాలా సెర్చ్ ఇంజిన్లు, గూగుల్‌లో ట్విట్టర్ అని రాస్తే, రిజల్ట్స్‌లో మాత్రం X పేరు వస్తోంది. ఎక్కడా ట్విట్టర్ పేరు లేదు. దీంతో యాప్ ప్రామాణికతను వెరిఫై చేయడంలో చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కొంత గందరగోళం..

ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ప్రపంచంలో ఉండే వ్యక్తులకు ట్విట్టర్ X రీబ్రాండింగ్ గురించి తెలుసనే భావిస్తున్నాను. అయితే అందరికీ కాదని ఆయన చెప్పుకొచ్చారు.ట్విట్టర్ కొత్త పేరు, రూపాన్ని గందరగోళానికి గురి చేశాయని, ట్విట్టర్ కొత్త విజువల్స్ ఇంటర్నెట్ వినియోగదారులకు తెలీదని పలువురు పేర్కొన్నారు. అందులోనూ నైలు నది గతాన్ని కూడా ప్రస్తావించలేదు. ఈ కారణంగా చాలా తక్కువగా డౌన్‌లోడ్ల సంఖ్య ఉంది. X పేరు, ఎలన్ మస్క్ ట్విట్టర్,లోగో మార్పు వల్ల డౌన్‌లోడ్లు తగ్గడంపై ఇప్పటివరకు స్పందించలేదు. చూడాలి మరి ఎలన్ మస్క్ ఈ సమస్యను ఎలా సాల్వ్ చేసుకుంటాడో.. ఎంత త్వరగా రికవర్ అవుతాడనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.