అరెస్ట్‌ అయిన దేశవాళీ క్రికెటర్లు

అరెస్ట్‌ అయిన దేశవాళీ క్రికెటర్లు

రాష్ట్ర స్థాయిలో లీగ్‌ నిర్వహించేందుకు ఐపీఎల్‌ తరహాలో బీసీసీఐ అనుమతి ఇచ్చిన తొలి టోర్నీలో భారత్‌కు ఆడిన కర్ణాటక అగ్రశ్రేణి క్రికెటర్లంతా పాల్గొంటున్న నేపత్యంలో భారీ స్పాన్సర్‌షిప్‌లు, టీవీ రేటింగ్స్‌ కూడా వస్తున్నాయి. కన్నడ సినీ, టీవీ ఆర్టిస్టులు రాక్‌స్టార్స్‌ అనే టీమ్‌ను కూడా ఆకర్షణ కోసమంటూ బరీలోకి దింపారు. కొంతకాలంగా ఫిక్సింగ్‌కు కేంద్రంగా మారిందని కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌ కేపీఎల్‌లో మరో కొత్త వివాదం బయటకు రాగ పోలీసులు ఆరోపణలతో ఇద్దరు కర్ణాటక క్రికెటర్లను అరెస్టు చేశారు.

చిదంబరం మురళీధరన్‌ గౌతమ్‌, అబ్రార్‌ కాజీ అనే ఇద్దరి దేశ ఆటగాళ్లని కేపీఎల్‌ ఫైనల్లోనే వీరిద్దరు స్పాట్‌ ఫిక్సింగ్‌ చేసినట్లు, బ్యాటింగ్‌ చేసేందుకు 20లక్షలు తీస్కున్నట్టు పోలీసులు తెలిపారు. గౌతమ్, కాజీ ఫిక్సింగ్‌ బెంగళూరు బ్లాస్టర్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఫిక్సింగ్‌ పాల్పడినట్లు సమాచారం.

సీఎం గౌతమ్‌కు ఫిక్సింగ్‌కు పాల్పడి అరెస్టయిన కూడా మంచి ఆటగాడిగా గుర్తింపు ఉంది. 11ఏళ్ల కెరీర్‌లో 94 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 41.36 సగటుతో 4716 పరుగులు చేశాడు. కర్ణాటకకు జట్టు 9 సీజన్ల పాటు వైస్‌కెప్టెన్‌గా ఆడి వరుసగా రెండు సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.