బీహార్ లో ఘోరం జరిగింది. పెళ్లైన రెండు రోజులకే వరుడు కరోనాతో ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత వివాహానికి హాజరైన వారిలో 95 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడం ఇప్పుడు తీవ్రంగా కలకలం రేపుతోంది. అయితే బీహార్‌లోని పాలిగంజ్ పట్టణంలో దీహపాలికి గ్రామానికి చెందిన యువకుడు గురుగ్రామ్‌లో.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. పెళ్లి కోసం మే 12న గ్రామానికి వచ్చాడు. దీంతో అతడు కరోనా బారిన పడినా గుర్తించకపోవడంతో పాలిగంజ్ సమీపంలోని ఓ గ్రామంలో ఈ నెల 15న ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు.
అయితే పెళ్లైన రెండు రోజులకే వరుడి ఆరోగ్యం క్షీణించడంతో పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించారు. మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యలు తెలిపారు. ఆ తర్వాత కరోనా పరీక్షలు చేయించకుండానే వరుడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలిసిన అధికారులు వివాహానికి హాజరైన వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 95 మందికి కరోనా సోకినట్టు తేలింది. కాగా వధువుకు మాత్రం పరీక్షల్లో నెగటివ్ అని వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. కాగా బాధితులందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. పెళ్లికి 50 మందికి మాత్రమే అనుమతి ఉండగా. అంతకుమించి హాజరైనట్టు అధికారులు వివరించారు. మరి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.