24వ దుబాయి షాపింగ్ ఫెస్టివల్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం నిర్వహించబోనున్నది. ప్రతి ఏటా దుబాయి షాపింగ్ ఫెస్టివల్‌ను యూఏఈ ప్రభుత్వం నిర్వహిస్తు ఈ సారి ఏకంగా 3,500 షాపింగ్ ఔట్‌లెట్స్‌ను ఏర్పాటు చేసి పర్యాటకులని ఆకర్షించేలా సన్నాహాలు చేస్తున్నారు
ప్రత్యేక ఆఫర్లు అనేక రకాల సామగ్రిపై ఇస్తూ వివిధ దేశాలకు చెందిన వివిధ రకాల ఆహార పదార్థాలను వండిపెట్టడానికి రెస్టారెంట్లు కూడా ఏర్పాతు చేస్తున్నారు. 700కు పైగా బ్రాండ్లు వాటి ఉత్పత్తులను షాపింగ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఉంచి వివిధ దేశాల సంస్కృతి, కళల గురించి సంబందించిన కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు.
3000రిటైలర్లు కూడా పాల్గొంటున్న ఈ షాపింగ్ ఫెస్ట్ ఫిబ్రవరి 2 వరకు కొనసాగానున్నది. నచ్చని వాటిని కొనేందుకు ప్రపంచం తిరగవలసి అవసరం లేకుండా చాలా ఫేమస్ అయిన దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ లో లైఫ్‌స్టైల్, బ్యూటీ, ఫ్యాషన్, జువెలరీ ఉత్పత్తులపై 25 నుంచి 90 శాతం వరకు ఇవ్వనున్నారు.
షాపింగ్ చేయడమే కాకుండా ఫ్యాషన్ షోలు కూడా ఉంటాయి. ప్రపంచ స్థాయి ఫ్యాషన్ ట్రెండ్స్ ను, లేటెస్ట్ స్టైల్స్ ను చూసి నచ్చినవి కొనుగోలు చేయవచ్చు. సేదతీరేందుకు మార్కెట్ ఔట్ సైట్ ద బాక్స్ ఏర్పాటు చేశారు. ఇందులో స్థానిక, విదేశీ బ్రాండ్ల స్టాల్స్ ఇంకా లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ కి డీజేలు, లైవ్ మ్యూజిక్ ఈవెంట్స్, డాన్స్ షోలు ఉంటాయి. .