దేశ ప్రజలకు UIDAI హెచ్చరిక.! ఆధార్‌ అప్‌డేట్ విషయంలో ఆద మరిస్తే అంతే సంగతులు..!

Aadhaar update
Aadhaar update

ఆధార్ కార్డు అప్‌డేట్ పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్, ఈ-మెయిల్స్ ద్వారా మీ డేటాను సులభంగా చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి UIDAI ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.ఇప్పటికీ చాలా మంది ఆధార్ కార్డ్ అప్‌డేట్ విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిని చాలా మంది ఆన్‌లైనులో అప్‌డేట్ చేసుకునేందుకు అనధికార సైట్లను ఓపెన్ చేయకుండా,ఆధార్ సెంటర్‌ మీకు సమీపంలో ఉంటే వెళ్లాలని, లేదంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు అధికారిక వెబ్‌సైట్ MyAadhaar పోర్టల్ ద్వారా మాత్రమే అప్‌డేట్ సూచించారు. దీనికి సంబంధించి తాజాగా ట్విట్టర్లో ఓ ట్వీట్ కూడా చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందుకే ఆధార్ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. తమ వ్యక్తిగత వివరాలను ఆధార్ అప్‌డేట్ విషయంలో ఎవ్వరితోనూ షేర్ చేసుకోకండి. ముఖ్యంగా ఈమెయిల్, వాట్సాప్ ద్వారా పొరపాటున కూడా పంపకూడదని గుర్తుంచుకోండి.

పదేళ్లు పూర్తయిన వారు మాత్రమే..

ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు పూర్తయిన వారు మాత్రమే బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే UIDAI పలుమార్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం దీన్ని ఉచితంగానే చేసుకోవచ్చు. దీని కోసం సెప్టెంబర్ 14వ తేదీ వరకు గడువు విధించింది. ఇప్పటివరకు ఆధార్ అప్డేట్ చేసుకోని వారు నిర్ణీత సమయంలోపు చేసుకోవచ్చు.

వీటిని ఎప్పటికీ అడగరు..

మీ ఆధార్‌కార్డును అప్‌డేట్ చేయడానికి POI/POA పత్రాలను షేర్ చేయమని UIDAI ఎప్పటికీ మిమ్మల్నిఅడగదని, ఆధార్ అధికారుల మేరకు తెలిపారు.. . కనుక ఈ డీటెయిల్స్ మీరు ఎవ్వరికి షేర్ చేయాల్సిన అవసరం లేదు.

మీరు ఆధార్‌కార్డ్ అప్‌డేట్ చేసుకోవడానికి QR కోడ్ ఉపయోగించొచ్చు. ఇందులో డిజిటల్ సంతకం చేయబడి ఉంటుంది. ఇది ట్యాంపర్ ప్రూఫ్‌తో వస్తుంది. దీన్ని దొంగిలించడం చాలా కష్టం.

QR కోడ్ ద్వారా ఆధార్‌ను ఎలా ధ్రువీకరించాలి?

* ముందుగా mAadhar యాప్ ను యాపిల్ యాప్ స్టోర్ లేదా మీ స్మార్ట్‌ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* ఆ తర్వాత వెరిఫై ఆధార్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* ఈ-ఆధార్ లేదా ఆధార్ PVCకి సంబంధించి QR కోడ్‌ని స్కాన్ చేయాలి.ఆ తర్వాత ఫోన్ కెమెరా ఆధార్ కార్డు.
* యాప్ QR కోడ్‌ని స్కాన్ చేసి, ఆధార్ కస్టమర్ సమాచారాన్ని స్క్రీన్‌పై చూపిస్తుంది.
* ఆ తర్వాత మీ డేటాను చెక్ చేసి వెరిఫై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

మీరు అప్‌డేట్ చేసుకునే సందర్భంలో ఏమైనా వివరాలు తప్పుగా ఉన్నా, మీకు ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే 1947 హెల్ప్‌లైన్ నెంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి లేదంటే uidai.gov.in వెబ్‌సైట్‌లో కంప్లైంట్ చేయొచ్చు. మరోవైపు మీరు పబ్లిక్ కంప్యూటర్లలో ఈఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడితే.. మీ పని పూర్తయిన వెంటనే వాటిని అందులో నుంచి పర్మినెంటుగా డిలీట్ చేయాలని అధికారులు సూచించారు. ఇతరుల మొబైల్ నెంబర్‌ను కూడా మీ ఆధార్‌కు లింక్ చేసుకోవద్దని, మీకు వచ్చే ఓటీపీలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దని సూచించారు.