Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్వతంత్ర భారత చరిత్రను కాసేపు పక్కన పెడదాం. బ్రిటీష్ కాలంలోనే పోలవరానికి పునాదిరాళ్లు పడ్డాయి. అప్పట్లో తెల్లదొరలు అనుకున్న పని జరగలేదంటే… ఈ ప్రాజెక్టు ఎప్పటికీ సాధ్యం కాదని మనవాళ్లు కూడా లైట్ తీసుకున్నారు. కానీ పబ్లిసిటీ స్టంట్లు మాత్రం బాగానే చేశారు. అయితే ముఖ్యమంత్రుల్ని మించిపోయిన మాటకారి ఉండవల్లి మిలీనియం జోక్ వేసి అందర్నీ నవ్విస్తున్నారు.
వైఎస్ బతికుంటే 2011 నాటికే పోలవరం పూర్తయ్యేదని ఆయన చెప్పడం కామెడీ ఆఫ్ ది డికేడ్ అంటున్నారు జనం. వైఎస్ కూడా షో చేశారే కానీ పని చేయలేదని, కొంత పని జరిగిందంటే… ప్రాజెక్టు వల్ల జరిగే లాభం పోతుందేమేననే ఆత్రమే తప్ప… ప్రజల కోసం కాదని ప్రత్యర్థులు మండిపడుతున్నారు. విభజన జరగదని బల్లగుద్ది చెప్పిన ఉండవల్లి… ఆ తర్వాత నోరు మూసుకున్నారు. ఇప్పుడూ పోలవరం విషయంలో అదే జరుగుతుందంటున్నారు టీడీపీ నేతలు.
నోరు మంచిదైతే ఉండవల్లికి ఊరు మంచిదౌతుందని, ముందు నోటిని శుద్ధి చేసుకోవాలని సెటైర్లు పడుతున్నాయి. తాత్కాలిక సెక్రటేరియట్ ను శాశ్వతమని చెప్పేసిన ఉండవల్లి… నా లాజిక్కు ఇంతే అంటున్నారు. అదేమంటే స్వయంప్రకటిత మేధావినని విర్రవీగుతున్నారు. రాజకీయ ప్రయోజనాలు లేవంటున్న ఉండవల్లి… ఉన్నట్లుండి ఎందుకు ఊడిపడ్డారనే ప్రశ్నలోనే సమాధానం ఉంది.
మరిన్ని వార్తలు