తెలుగుదేశం కోరితే మద్దతిస్తా !

Undavalli Arun Kumar controversy comments on Chandrababu

  Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ కి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి ది ప్రత్యేక శైలి, రాజకీయ విశ్లేషణల లోను ఆయనది అందెవేసిన చెయ్యి. ఏదైనా విషయం మీద పూర్తిగా అవగాహన వచ్చాకే మాట్లాడడం ఆయన ప్రత్యేకత. అదే విధంగా ప్రత్యేక హోదా మీద ఇన్ని రోజులుగా నిరసనలు జరుగుతూ ఉన్నా ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయాన ఈరోజు నోరు విప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన పలు అంశాల మీద విపులంగా చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సాగుతున్న పోరాటంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు అదే సమయంలో ఇతర పక్షాల పోరాటం, అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదన్న విషయంతో పాటు… ఓటుకు నోటిచ్చే రాజకీయాలపై ఉండవవల్లి కీలక వ్యాఖ్యలు చేసి ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమే రేపారు.

ముందుగా హోదా కోసం తెలుగుదేశం ఎంపీల పోరాటాన్ని గురించి ప్రస్తావించిన ఆయన దానిని కేవలం నాటకంగా అభివర్ణించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే తన పార్టీ ఎంపీలతో చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నారని ఉండవల్లి నిప్పులు చెరిగారు. గత నాలుగేళ్లలో ఏపీకి రూ. 18.50 లక్షల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ప్రకటన చేసారని దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో ఇది 20 శాతం అని ప్రకటించారని ఇలా పెట్టుబడులు పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చెప్పుకుంటుంటే ఇక హోదా – పన్ను రాయితీలు ఎందుకని వస్తాయని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ బాగు పడాలంటే ఒక్క ఎన్నిక చాలని రానున్న ఎన్నికల్లో డబ్బు ఇచ్చిన వాడికి ఓటెయ్యెద్దని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు. డబ్బు ఖర్చు పెట్టినవాడు ఈ ఎన్నికల్లో ఓడిపోయి తీరాలని అప్పుడే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఓటేయండి అని అడిగేప్పుడు ప్రత్యేక హోదా ఇలా సాధిస్తాం అని ప్రజలకు వివరించండి. ఏదో ఒకటి చెప్పండి. మా దగ్గర వెంట్రుక ఉంది… వెంట్రుకను ముడేసి కొండను లాగుతామని చెప్పండి, అంటూ రాజకీయ పార్టీలకి ఒక రకంగా తలంటారు. ఎన్నికలు అయ్యాక హోదా ఎలా తెస్తారో టిడిపి, వైసీపీలు చెప్పాలని, ఎందుకంటే టిడిపి వైసీపీలు కేంద్రంలో ప్రధాని స్థాయిలో ఉండేవారు కాదు. ఎలా తెస్తారు..? రేపటి ఎన్నికల్లో ఎన్డీయే రావొచ్చు లేదా యుపిఎ రావొచ్చు.

రాహుల్ హోదా కోసం సంతకం చేస్తా అని ఇప్పుడు చెప్పొచ్చు, కాని చేయాల్సింది ప్రధాని అయ్యాక అసలు కాంగ్రెస్, బిజెపి నేరుగా తలపడే సీట్లు 154 మాత్రమే. అధికారంలోకి రావాలంటే మెజారిటీ 273 సీట్లు కావాలి. అన్ని సీట్లు కాంగ్రెస్ సింగిల్ గా సాధించే పరిస్థితి లేదు. ఇక బిజెపి మొన్నటి ఎన్నికల లాగా పూర్తి మెజారిటీ సాధించలేదు. దాంతో ఈ రెండు పక్షాల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా మిత్రపక్షాలపై ఆధారపడవలిసిందే. ఐదేళ్ల తరువాత కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందని అన్నారు. ఎన్నికలకు అప్పుడే ఆశావాహులు రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో అధికార పక్షం ఓటుకు రెండువేలరూపాయలకు కొనేందుకు సిద్ధమని ప్రచారం జరుగుతుంది. ప్రతిపక్షం కూడా రెండు వేలు ఇచ్చేవారు ఎవరున్నారా? అని సీట్లు ఇచ్చేందుకు వెతుకుతుంది.

20 కోట్లు ఖర్చు పెట్టె వాడు ముందు అవి రికవర్ చేసుకుంటాడా, మనకి సేవ చేస్తాడ అని ఉండవల్లి ప్రశ్నించారు పేదవారు మోసం చేసే వాళ్ళు కాదు ఒక వేళ చేద్దాం అనుకున్న అందుకు మన్నస్సాక్షి ఒప్పుకోదు అందుకే మీరంతా నోటా కి వోటెయ్యండి అని ఉండవల్లి పిలుపునిచ్చారు. ప్రతి రోజు ఒక్కో ఓటరు పై 523 రూపాయలు ప్రభుత్వం చేసే ఖర్చును రూపాయికి అమ్మేసుకుంటారా ? ముష్టివాడు సైతం రూపాయి వేస్తే తిరస్కరిస్తున్నాడు అందుకే డబ్బిచ్చే వాడినే ముందు ఓడించండి అని ఉండవల్లి పిలుపునిచ్చారు. అదే విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమానికి సంబంధించి తనను పిలిస్తే టీడీపీ నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలుపుతానని ఉండవల్లి అన్నారు.