Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవంటారు. టీడీపీ సర్కార్ ఊస్టింగ్ చేసిన ఐవైఆర్ కి ఈ నానుడి అతికినట్టు సరిపోతుంది. ఆదినుంచి ఆయన వ్యవహారశైలి తెలిసినవాళ్ళకి చంద్రబాబు సర్కార్ ఐవైఆర్ కి పెద్ద పీట వేయడమే ఆశ్చర్యకరం. కానీ ఆ రోజు బాబుకి కొందరు పార్టీ నేతలు చెప్పినా ఆయన వినకుండా ముందుకెళ్లారు. నిజానికి ఐవైఆర్ ఆదినుంచి కాంగ్రెస్ అనుకూలవాది. ఉండవల్లి అండతో వై.ఎస్ కి దగ్గరగా వెళ్లగలిగారు. సర్కార్ మారినా ఆయన ఆలోచనలు మారలేదు. క్యాబినెట్ ర్యాంక్ దక్కినా ఐవైఆర్ కృష్ణారావు కి లోపల్లోపల అసంతృప్తి ఉండేదట. దీనికి కారణం ఆయనకి వై.ఎస్ ఫ్యామిలీ మీదున్న ఆసక్తే.
ఈ విషయం తెలుసుకున్న జగన్ లోపాయికారీగా ఐవైఆర్ తో సంప్రదింపులు జరిపి ఆయనకు వైసీపీ తరపున విజయవాడ సెంట్రల్ టికెట్ ఆఫర్ చేశారట. దానికి పడిపోయిన ఐవైఆర్ బాబు పక్కనే ఉండి వెన్నుపోటుకి సిద్ధం అయ్యారు. ఉండవల్లి కూడా ఈ వ్యవహారంలో తన వంతు పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం చూసిన ఏపీ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. రాజకీయనేతలు పదవుల కోసం వెంపర్లాటతో పార్టీలు మారతారని అనుకుంటుంటే… ఈ మాజీ ఐఏఎస్ ఏకంగా ఓ పార్టీ చలవతో క్యాబినెట్ ర్యాంక్ పొంది మరీ వారికే వ్యతిరేకంగా పని చేయడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదేమైనా ఐవైఆర్ వ్యవహారం చంద్రబాబుకి పెద్ద షాక్.