ఆ కేంద్ర మంత్రి పేరు మార్చుకున్నారు…!

Union Minister Giriraj Singh Goes For Name Change Adds His Gotra Shandilya

అనునిత్యం ఏవో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన ఏకంగా తన పేరు మార్చుకున్నారు. తన పేరుకు ముందు గోత్రాన్ని కూడా కలుపుకుంటున్నట్టు ఆయన తెలిపారు. దీంతో, ఆయన పేరు ఇకపై శాండిల్య గిరిరాజ్ సింగ్ గా మారనుంది.

Union-Minister-Giriraj-Sing

తాను మార్చుకోవడమే కాక హిందువులంతా ఇలా పేరుకు ముందు గోత్రాన్ని పెట్టుకుని ‘సనాతన ధర్మాన్ని’ అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడాలంటే సనాతన ధర్మాన్ని హిందువులంతా ఆచరించాల్సిందేనని చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడటానికి మహర్షులు చూపిన బాటలో పయనించాల్సిన అవసరం ఉందని అన్నారు. మనంతట మనమే ఎవరి గోత్రాలను వారు పేరు ముందు చేర్చుకోవాలని సూచించారు. సనాతనులందరూ తమ పేరులో గోత్రాన్ని చేర్చుకోవాలని కోరుతున్నానంటూ గిరిరాజ్ ట్వీట్ చేశారు.

Gotra-Shandilya