ఒక వక్తి చేసిన బహిరంగ మూత్ర విసర్జన అతని ప్రాణం తీసింది. అదేంటి అనుకుంటున్నారా, అయితే చదవండి, దక్షిణ ఢిల్లీలోని గోవింద్‌పురిలో లీలు ఢోకాలియా, పింకీ దంపతులు నివసిస్తున్నారు. లీలు ఢోకాలియా కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఐతే సోమవారం అర్థరాత్రి లీలూ ఇంటి సమీపంలో పక్కింట్లో ఉండే మాన్‌సింగ్ (65) మూత్రం పోశాడు. ఆ సమయంలో లీలు భార్య పింకీ అక్కడే ఉంది. మహిళల ముందు ఇలా చేయడమేంటని ప్రశ్నించడంతో గొడవ తలెత్తింది. ఈ క్రమంలో మాన్ సింగ్ మీద పింకీ చేయి చేసుకుంది. మాన్‌సింగ్ గట్టిగా కేకలు వేయడంతో ఆయన భార్యా, ఇద్దరు పిల్లలు బయటకు వచ్చి పింకితో గొడవ పెట్టుకున్నారు. బయట నుంచి అరుపులు విని పింకీ భర్త లీలూ కూడా బయటకొచ్చాడు. దాంతో గొడవ మరింద పెద్దదయింది. చుట్టు పక్కల ప్రజలు వచ్చి జోక్యం చేసుకోవడందో ఇరు కుటుంబాలు శాంతించాయి. ఐతే అంతలోనే మాన్‌సింగ్ కుమారుడు రవి మాత్రం ఓ సిమెంట్ పలకతో లీలూపై దాడిచేశాడు. ఛాతీపై బలంగా కొట్టడంతో అతడు కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే లీలూ చనిపోయాడని డాక్టర్లు ధృవీకరించారు.ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.