ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్”: మాస్ లుక్ లో పవన్ కళ్యాణ్..!

Ustad Bhagat Singh
Ustad Bhagat Singh": Pawan Kalyan in mass look..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్య‌ణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్ష‌ణం వచ్చేసింది . “కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే నేను..” అంటూ ప‌వ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ఘ‌ట్టాన్ని చూసి అభిమానులు అందరూ సంతోషంతో ఊగిపోతున్నారు. వారి సంతోషాన్ని మ‌రింత పెంచేస్తూ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ సినిమా నుండి ఒక సాలిడ్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు.

పూర్తిగా యాక్ష‌న్ మోడ్ లో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోస్ట‌ర్ ని ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ చూసి ప‌వ‌న్ అభిమానులు అందరూ కేక‌లు పెడుతున్నారు. ప‌ర్ఫెక్ట్ టైమ్ లో ప‌ర్ఫెక్ట్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారంటూ మూవీ మేక‌ర్స్ కి థ్యాంక్స్ చెబుతున్నారు.

Ustad Bhagat Singh": Pawan Kalyan in mass look..!
Ustad Bhagat Singh”: Pawan Kalyan in mass look..!

ఇక ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ మూవీ ఇప్ప‌టికే షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, ఈ మూవీ ను పవ‌ర్ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా చిత్ర యూనిట్ తెర‌కెక్కిస్తోంది. ఈ మూవీ లో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా అశుతోష్ రానా, గౌత‌మి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీ ని మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.