Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తీవ్ర ఆరోగ్య సమస్యలతో నిన్న ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం కూడా ఆయన ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు అధికారిక హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తూ, వాజ్ పేయికి ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన పరిస్థితిని వైద్యుల ప్రత్యేక బృందం ఎప్పటికప్పుడు గమనిస్తోందని వెల్లడించారు. చికిత్సకు వాజ్ పేయి స్పందిస్తున్నారని కానీ శరీరంలోని పలు అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకినట్టు ఆ బులెటిన్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే వాజ్ పేయిని అడ్మిట్ చేసిన ఎయిమ్స్ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం ఇప్పుడు పలు అనుమానాలకి తావిస్తోంది. ఈ ఉదయం కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎయిమ్స్ కు వెళ్లి వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.