Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Vajrapath App launching By AP Government To Identify Thunderbolt
పిడుగుపాటును పసిగట్టేందుకు రూపొందించిన వజ్రపథ్ యాప్ను సీఎం చంద్రబాబు బుధవారం ఆవిష్కరించనున్నారు.
►ఉండవల్లిలోని సీఎం నివాసంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
►ఈ సందర్భంగా ఇస్రో, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.
►ఈ రెండు సంస్థల భాగస్వామ్యంలో ఏపీ స్పేస్ ఇన్నోవేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నాయి.
►కాగా, ఇస్రో, బెంగళూరులోని ఓ స్టార్టప్ కంపెనీ సాయంతో చిత్తూరు జిల్లాలోని కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఈ యాప్ను రూపొందించారు.
►రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కాలేజీల సంయుక్త సహకారంతో ఈ యాప్ సేవలను వినియోగించుకోనున్నారు.
►ఇందుకు అవసరమైన సాంకేతికతను ఇస్రో, నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అందించనున్నాయి.
►చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న యూనివర్సిటీలు, పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో పిడుగుపాటును గుర్తించి హెచ్చరికలు పంపే పరికరాలను అమరుస్తారు.
►పిడుగు పడే అవకాశం ఉండే వెంటనే ఆ సమాచారాన్ని వజ్రపథ్ యాప్ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు.