Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ ని కాపు వ్యతిరేక, బీసీ అనుకూల పార్టీగా ముద్ర వేయడానికి ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఓ వారం లోపే వంగవీటి రాధాని పార్టీ నుంచి పంపించడం ద్వారా ఈ వ్యూహాన్ని జగన్ అమలు చేస్తాడని తెలుగు బులెట్ ఓ అంచనా వేసింది. అందుకు తగ్గట్టే జరిగినట్టు తెలుస్తోంది. వంగవీటి రాధకి విజయవాడలో టికెట్ లేదని జగన్ దాదాపుగా తేల్చేసినట్టు సమాచారం. విజయవాడ సెంట్రల్ లో మల్లాది విష్ణు, ఈస్ట్ లో వెల్లంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవిని పార్టీలోకి తెచ్చి వెస్ట్ స్థానం ఇవ్వాలని వైసీపీ భావిస్తోందట. ఈ విషయాన్ని ఛుచాయగా రాధతో చెప్పిన వైసీపీ హైకమాండ్ దూతలు అవనిగడ్డ వెళ్లి పోటీకి సిద్ధపడాలని రాధకు సూచించారట. దీంతో రాధా తీవ్రంగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది.
వైసీపీ లో జరుగుతున్న పరాభవాలని ఇక తట్టుకోవడం వల్లకాదని వంగవీటి రాధా తన అనుచరవర్గంతో చెప్పుకుని బాధపడ్డారట. విజయవాడలో తనకు స్థానం లేకుండా చేసిన ఆ పార్టీ మీద బదులు తీర్చుకోవాలంటే టీడీపీ లో చేరడం మినహా ఇంకో మార్గం లేదని వారికి నచ్చజెప్పారంట. ఆది నుంచి పార్టీని నమ్ముకున్న తనను పక్కనబెట్టి ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వస్తున్నవారికి టికెట్స్ ఇవ్వడానికి జగన్ ఆసక్తి చూపడం తో ఇక వైసీపీ లో కొనసాగినా ఏ ప్రయోజనం ఉండబోదని రాధా ఓ కచ్చితమైన అభిప్రాయానికి వచ్చారట. దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ అధికారానికి వచ్చే అవకాశం లేనందున ఆ పార్టీని పట్టుకుని వేలాడాల్సిన అవసరం ఏంటని అనుచరులు సైతం రాధా వాదనకు మద్దతుగా నిలిచారట. ఇక కాపులు ఎక్కువగా వున్న ఉభయగోదావరి జిల్లాల్లో కూడా వాళ్ళు రాజకీయంగా టీడీపీ వైపే మొగ్గుజూపుతున్నారని కూడా కొందరు అనుచరులు రాధా దృష్టికి తెచ్చారట. మొత్తానికి రాధా, ఆయన అనుచరులు టీడీపీ లో చేరికకు ఓకే అనుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ నెల 22 న రాధా, ఆయన అనుచరులతో పాటు సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందట.