చాలా సంవత్సరాల తర్వాత వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను నెత్తికి ఎత్తుకున్నాడు. ఇంత కాలం ఏదో వివాదాస్పద చిత్రం లేదా చిన్న హీరోలతో తెలుగులో చిత్రాలు చేస్తూ వచ్చిన వర్మ ఎట్టకేలకు నాగార్జున వంటి స్టార్ హీరోతో సినిమాను మొదలు పెట్టాడు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో చాలా ఆసక్తి ఉంది. శివ కాంబినేషన్‌లో సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశానికి తాకేలా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబచ్చన్ నటించబోతున్నట్లుగా గత మూడు నాలుగు రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. అంచనాలను పెంచేసిన ఆ వార్త కేవలం పుకారు అంటూ వర్మ తేల్చి చెప్పాడు.
తాజాగా మీడియాలో వస్తున్న వార్తలను కొట్టి పారేస్తూ వర్మ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనలో.. మా సినిమాలో అమితాబచ్చన్ నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని, అసలు అలాంటి ప్రపోజల్ మేం చర్చించలేదని, తాను అమితాబచ్చన్‌తో సంప్రదించలేదు అంటూ వర్మ క్లారిటీగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తు బిజీగా ఉన్నాడు. నాగార్జున పోలీస్ ఆఫీసర్‌గా ఈ చిత్రంలో కనిపించనున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో అమితాబచ్చన్ నటిస్తాడని ఆశించిన ప్రేక్షకులు వర్మ ప్రకటనతో ఉసూరుమంటున్నారు.