ప్రాణాలతో బయటపడ్డ వరుణ్ ధావన్‌

ప్రాణాలతో బయటపడ్డ వరుణ్ ధావన్‌

బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ ధావన్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కూలీ నెం 1 సినిమా షూటింగ్‌లో భాగంగా సజావుగా జరిగిపోవాల్సిన ఓ సన్నివేశం పెను ప్రమాదంగా మారింది. ఈ ఘటన నుంచి వరుణ్ త్రుటిలో తప్పించుకున్నాడు కాబట్టి సరిపోయింది.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పుణెలో జరుగుతోంది. అక్కడి శివారు ప్రాంతాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోయలో పడిపోయేందుకు రెడీగా ఉన్న కారులో వరుణ్‌కు సంబంధించిన క్లోజప్ షాట్స్ షూట్ చేయాల్సి ఉంది. షాట్ ఓకే అయ్యాక వరుణ్ కారు డోర్ తీసుకుని బయటికి దూకేయాలి. కానీ కారు తలుపులు ఇరుక్కుపోవడంతో ఆయన అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకొద్దిసేపు అక్కడే ఉండి ఉంటే కారుతో పాటు వరుణ్ లోయలో పడిపోయి ఉండేవాడట.

ఈ స్టంట్ చేయడానికి ముందు ప్రొఫెషనల్స్ సమక్షంలో చాలా సార్లు రిహార్సల్స్ చేశారట. అన్ని సార్లు షాట్ బాగానే వచ్చింది కానీ వరుణ్ ధావన్‌తో తీయాల్సిన ఫైనల్ షాట్‌ మాత్రం రిస్కీ అయిపోయింది. కదలకుండా కారులోనే ఊపిరి బిగపట్టి కూర్చున్న వరుణ్‌ని అక్కడే ఉన్న స్టంట్ కోఆర్డినేటర్స్ చాకచక్యంగా బయటికి లాగారు. మొత్తానికి ఆయన ప్రాణాలతో బయటపడ్డాడని వరుణ్ తండ్రి, డైరెక్టర్ డేవిడ్ ధావన్ తెలిపారు.