‘కంచె’ చిత్రంతో రెండవ ప్రపంచ యుద్ద కాలానికి తీసుకు వెళ్లిన మెగా హీరో వరుణ్ తేజ్, ప్రస్తుతం అతరిక్షం అనే చిత్రంతో ఏకంగా అంతరిక్షంలోకి తీసుకు వెళ్లబోతున్నాడు. త్వరలోనే అంతరిక్షం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. భారీ అంచనాలున్న అంతరిక్షం మూవీ విడుదల అవ్వడమే ఆలస్యం ఈసారి మెగా హీరో నిజాం కాలంకు తీసుకు వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
ఈమద్య కాలంలో టాలీవుడ్ లో పీరియాడిక్ చిత్రాలు ఎక్కువ అయ్యాయి. రంగస్థలం నుండి మొదలుకుని వరుసగా పీరియాడిక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్, రాధాకృష్ణ చేస్తున్న సినిమా కూడా పీరియాడిక్ చిత్రమే అనే విషయం తెల్సిందే. ఇదే సమయంలో సాగర్ చంద్ర అనే దర్శకుడు నిజాం కాలం నాటి ఒక ప్రేమ కథను వరుణ్ వద్దకు తీసుకు వెళ్లడం, ఆ కథ బాగా నచ్చి వెంటనే నటించేందుకు ఒప్పేసుకోవడం జరిగిందట.
గతంలో ‘అప్పట్లో ఒక్కడుండేవాడు’ అంటూ విభిన్నమైన చిత్రంను తెరకెక్కించి అలరించిన దర్శకుడు సాగర్ చంద్ర ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. వరుణ్ తేజ్ ఈమద్య కాలంలో మంచి కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. అందుకే నిజాం నవాబ్‌ల కాలం సినిమా కూడా తప్పకుండా బాగుంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.