Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టైటిల్ తో అమాంతం అటు టాలీవుడ్ దృష్టినీ, ఇటు ప్రేక్షకుల దృష్టినీ తనవైపుకు తిప్పుకున్న సినిమా తొలిప్రేమ. బాబాయ్ పవన్ కళ్యాణ్ కెరీర్ ను మలుపు తిప్పిన తొలిప్రేమ టైటిల్ ను ధైర్యంగా తన సినిమాకు పెట్టుకున్న వరుణ్ తేజ ఈ మూవీపై చాలా ఆశలే పెట్టుకున్నారు. తొలి ప్రేమ తనకు కూడా భారీ హిట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అనుకున్నట్టుగానే సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. జ్ఞాపకాలు చెడ్డవైనా… మంచివైనా… ఎప్పు డూ మనతోనే ఉంటాయి. మోయక తప్పదు అంటూ బరువైన డైలాగ్ తో మొదలైన ట్రైలర్ తొలిప్రేమ సాగే తీరును కళ్లకు కట్టింది.
ట్రైలర్ చివర్లో ఇదే డైలాగ్ ను రాశిఖన్నా చెప్పారు. గత సినిమాలతో పోలిస్తే వరుణ్, రాశి ఇద్దరి లుక్ తొలిప్రేమలో డిఫరెంట్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే బాబాయ్, అబ్బాయ్ సినిమాల మధ్య టైటిల్ తప్ప మరే పోలికా లేదన్నట్టు అర్ధమవుతోంది. ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తొలిప్రేమకు తమన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 10న సినిమా విడుదల కానుంది. ఈ ఉదయం 9గంటలకు రిలీజయిన ట్రైలర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ తొలిప్రేమ బాబాయ్ తొలిప్రేమను మించేలా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.