Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సినిమాకి తొలిప్రేమ అని బాబాయ్ పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టుకున్నప్పుడే ఎంత ధైర్యం అని చాలా మంది అనుకున్నారు. కధ మీద నమ్మకం అని కొందరు సరిపెట్టుకుంటే క్లాసిస్ ని టచ్ చేయకుండా ఉంటే మేలని ఇంకొందరు కామెంట్ చేశారు. ఎవరెన్ని అనుకున్నా వరుణ్ తేజ్ అనుకున్న టైటిల్ కే ఫిక్స్ అయ్యాడు. తాజాగా వచ్చిన ఆ సినిమా మలి ట్రైలర్ చూస్తుంటే సినిమాలో మ్యాటర్ ఉందనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్ ఓపెనింగ్ షాట్ చూడగానే ఎన్టీఆర్ , సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన లాస్ట్ షాట్ గుర్తుకు రావడం ఖాయం.
ఓ సరస్సు ముందు నుంచుని తండ్రి జ్ఞాపకాల గురించి ఎన్టీఆర్ మాట్లాడుతుంటాడు…ఇక్కడా సేమ్ టూ సేమ్ అలాంటి షాట్ లో వరుణ్ తేజ్ తొలిప్రేమ గురించి చెబుతుంటాడు. అయితే తొలిప్రేమ ట్రైలర్ లో ఇది ఫస్ట్ షాట్. ఆ విధంగా చూసినప్పుడు ఎన్టీఆర్ ఆపిన చోట మెగా హీరో మొదలెట్టినట్టే కదా..కావాలంటే మీరే చెక్ చేసుకోండి.