Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పవన్ అభిమానులు సోషల్ మీడియాలో శ్రీరెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తూ కామెంట్లు చేస్తున్నారు. సాధారణ అభిమానులేకాదు…టాలీవుడ్ హీరోలు సైతం శ్రీరెడ్డి వ్యాఖ్యలపై నిరసన వ్యక్తంచేస్తూ పవన్ కు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ శ్రీరెడ్డి వ్యాఖ్యలపై స్పందించాడు. నీ గురించి విమర్శించి, నిన్ను తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించే నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు. అలాంటి వారు వారి బలహీనతలను తెలుసుకోలేరు. వాళ్ల తప్పుల్ని వాళ్లు తెలుసుకోవడం కన్నా ఎదుటివారిని తప్పుడు వ్యక్తులుగా చూపించడంలోనే ఎక్కువ ఉత్సుకత ప్రదర్శిస్తారు అని పోస్ట్ చేశారు. దీనికి మెగా అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. పవన్ కళ్యాణ్ వీరాభిమాని, హీరో నితిన్ కూడా పరోక్షంగా శ్రీరెడ్డిని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. న్యూటన్ సిద్ధాంతాన్ని గుర్తుచేస్తూ చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుందని,దాని కోసం వేచిచూడాలని అన్నాడు. ప్రతిచర్య వస్తోందని హెచ్చరించాడు. ఉదయం 11 గంటల సమయంలో నితిన్ ఈ ట్వీట్ చేయగా…అది వైరల్ గా మారింది.