Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వీడీపీ అసోసియేట్స్ సర్వే లో 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని తేలడంతో వైసీపీ అనుకూల మీడియా ఆ ఫలితాల మీద ఈకలు పీకుతోంది. నిన్నేమో ఇది టీడీపీ వాళ్ళు చేయించిన సర్వే అని చెప్పుకుని ఊరట పొందిన ఓ గ్రేట్ వెబ్ సైట్ వీడీపీ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిన విషయం తెలుసుకుని నాలుక కరుచుకుంది. ఇక తాజాగా ట్రాక్ మార్చేసింది. వీడీపీ సర్వే ఒకవేళ నిజమే అయినా జగన్ ఎలా సీఎం అవుతారో అంచనా వేసుకుని స్వీయానందం పొందింది. వీడీపీ సర్వేలో టీడీపీ, బీజేపీ కూటమికి 47 శాతం ఓట్లు అన్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయాలి కదా అని సదరు వెబ్ సైట్ ఓ డౌట్ ముందుకు తెచ్చింది. పైగా ఆ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టే పనిలో జగన్ దూకుడుగా వుండాలని కూడా సలహా ఇచ్చింది.
ఇంతటితో అయిపోలేదు ఆ గ్రేట్ వెబ్ సైట్ విశ్లేషణ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కదా టీడీపీ గెలుస్తుంది అని వీడీపీ సర్వే చెప్పింది, కానీ ఎన్నికలకు ఇంకో 20 నెలలు టైం వుంది కదా అని ఈ లోగా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోదా అని సదరు వెబ్ సైట్ ఆశపడింది. అదే 20 నెలల టైం లో జగన్ కూడా ఇంకా బలహీనపడడని ఏదైనా గ్యారంటీ ఉందా? ఇక చివరిగా ఆ వెబ్ సైట్ కి మహా ఐడియా తట్టింది. వీడీపీ సర్వే లో 47 శాతం ఓటర్లు టీడీపీ, బీజేపీ కి వున్నారనుకున్నా వైసీపీ మహా కూటమి ఏర్పాటు చేస్తే జగన్ సీఎం అయిపోతారని ఆ వెబ్ సైట్ చెప్పేసింది. ఆ మహాకూటమిలో 3 శాతం ఓట్లు వస్తాయనుకుంటున్న జనసేన, కాంగ్రెస్ తో పాటు వామపక్షాల్ని కలుపుకోవాలని కూడా జగన్ కి సూచించింది. అందుకోసం అవసరం అయితే ఓ మెట్టు దిగాలని కూడా సుద్దులు చెప్పింది. జగన్ ఓ మెట్టు దిగినంత మాత్రాన అవతలివాళ్ళు ఆ ఒక్క మెట్టు దిగాలని ఎక్కడైనా రాసి ఉందా ? పైగా జగన్, పవన్ ఒక ఒరలో ఇముడుతారా? అధికారమే పరమావధిగా దేనికైనా సిద్ధం అన్నట్టు వ్యవహరించినంత కాలం 2014 ఫలితాలు ఎదురవుతాయి. ముందు వీడీపీ సర్వే తప్పు అన్న వాళ్ళు ఇప్పుడు ఆ సర్వే చెప్పిన దాని ప్రకారం కూడా జగన్ ఎలా అధికారంలోకి రావచ్చు అన్నది వివరించడం చూస్తుంటే జాలి వేస్తోంది.
మరిన్ని వార్తలు