Posted [relativedate] at [relativetime time_format=”H:i”] దేశంలోనే సాంకేతిక విద్యలో మంచి కళాశాలల సరసన నిలుచున్న విట్ ( వెల్లూర్ ఇన్ స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ) రేపు అమరావతిలో ప్రారంభం కాబోతోంది. అమరావతిలో ప్రెస్టీజియస్ విద్యాసంస్థల ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్ చూపిన చొరవ ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తోంది.
విట్ క్యాంపస్ ఏర్పాటు కోసం అమరావతి పరిధిలో ఏపీ సర్కార్ 200 ఎకరాలు కేటాయించింది. అందులో విట్ యాజమాన్యం ఈ ఏడాది జనవరిలో భవన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది, అతి తక్కువ సమయంలో 3 లక్షల 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసింది. రెండు బ్లాక్ లుగా ఈ నిర్మాణాలు చేపట్టింది. ఒక దానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు , ఇంకో దానికి సరోజినీ నాయుడు పేర్లు పెట్టారు.
రేపు విట్ నూతన భవన సముదాయం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు , సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. భవన సముదాయం ఇపుడు ప్రారంభం అవుతున్నప్పటిజీ క్లాసులు ఇంతకు ముందు నుంచే నిర్వహిస్తున్నారు. విట్ అమరావతిలో 24 రాష్ట్రాలకు చెందిన 630 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నారు.