Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆయన పార్లమెంటులో ప్రతిపక్షాలను చెడుగుడు ఆడుకుంటారు. కుడి ఎడమగా, ఎఢమ కుడిగా నిరూపించడంలో దిట్ట. ఆయనంటే ఇష్టం లేకపోయినా ఆయన మాట్లాడుతుంటే అలాగే వింటారు ప్రత్యర్థులు. అదే వెంకయ్య స్పెషాల్టీ. అలాంటి వెంకయ్య ముఖంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యాక కళ తప్పింది. తనకు ఇష్టం లేదని చెప్పినా బలవంతంగా అంటగట్టారని తెగ ఫీలైపోతున్నారు.
రాజకీయాల చరమాంకానికి చేరుకున్న వెంకయ్య.. చివర్లో కూడా పవర్ ఫుల్ గా ఉండాలని భావించడం తప్పేం లేదు. ఎంతోమంది సీనియర్లను కాదని, ఫామ్ లో ఉన్న వెంకయ్యకు ఉఫరాష్ట్రపతి పదవి ఇవ్వడంపై బీజేపీలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. అంత్యప్రాసలతో ప్రతిపక్షాలపై మండిపడి.. మోడీపై కనీవినీ ఎరుగని రీతిలో మోడీని పొగిడిన వెంకయ్యకు ప్రధాని ఇచ్చిన పదవి చూసి జనానికి ఏమీ అర్థం కావడం లేదు.
ఉపరాష్ట్రపతి పదవే ఇష్టం లేని వెంకయ్యకు.. పార్టీలో తన జూనియర్ అయిన కోవింద్ కింద పనిచేయాల్సి రావడం మరింత బాథ పెడుతోంది. వెంకయ్య బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోవింద్ కు ఆయనే పార్టీ పదవి ఇచ్చారు. ఇప్పుడు అలాంటి కోవింద్ కింద పదవిలో తానెలా కూర్చుంటానని వెంకయ్య సతమతమైపోతున్నారు. టైమ్ చూసి దెబ్బ కొట్టిన మోడీని చూసి.. ఇతను నిజంగా చాలా డేంజర్ అని ఇప్పుడనుకుంటున్నారు వెంకయ్య.
మరిన్ని వార్తలు