ఇండియాలో బిగ్ బాస్ మొదట నార్త్ సైడ్ నుండి బాగా పాపులరైంది. అక్కడ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బ్రహ్మండంగా నడిపిస్తున్నాడు. తాజాగా అక్కడ సీజన్ 12 పూర్తి అయ్యిందంటే అర్ధం చేసుకోవచ్చు ఎంతగా పాపులారిటీ సంపాదించుకుందో. బిగ్ బాస్ సౌత్ లో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వుతుంది. తమిళంలో కమల్ హసన్ హోస్ట్ గా మంచి పేరును దక్కించుకుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 లో ఎన్టీఆర్ హోస్ట్ గా మంచి హైప్ తీసుకువచ్చి అంతే గ్రేట్ గా ముగించాడు. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 2 ను నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా ప్రారంభించారు కానీ షో స్టార్ట్ అయ్యినప్పటినుండి వివాధలతోనే సాగింది. షో ఎండింగ్ వరకు గోదవలతోనే ముగిసింది. ఇప్పటికి ఆ షోలో పాల్గొన్న కాంటేస్తేంట్ ల మద్య సరిగ్గా మాటలు లేవు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 ని స్టార్ట్ చెయ్యాలని బిగ్ బాస్ షో నిర్వాహకులు ఆలోచిస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ ౩ కి హోస్ట్ గా చెయ్యాలంటే చాలా నేర్పు ఓర్పు కావాలి అందుకోసం నిర్వాహకులు బిగ్ బాస్ 3 కోసం అల్లు ఆర్జున్, విజయ్ దేవరకొండ, విక్టరీ వెంకటేష్ లను తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. గతంలో కూడా బిగ్ బాస్ సీజన్ ౩ కోసం ఆ ముగ్గరు స్టార్స్ పేర్లు వినిపించాయి. ఆ ముగ్గురు తో పాటుగా రానా పేరు కూడా వినిపించింది కానీ ఇప్పుడు రానా కాక్కుండా ఆ ముగ్గురు సీజన్ 3 కోసం భరిలో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ షో నిర్వాహకులు కూడా ఆ రూమర్స్ నిజమేని వాళ్ల నుండి సమాచారం లికైంది. ఆ ముగ్గురు లో ఇప్పుడు ఉన్న క్రేజీ కి షో ని ఉత్కంటభరితంగా నడిపిస్తారు అంటున్నారు బిగ్ బాస్ ప్రేమికులు. కానీ ఆ ముగ్గురు హీరోస్ లో వెంకటేష్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. బిగ్ బాస్ షో అధికారిక ప్రకటన వెలువడలిసిన అవసరం ఉన్నది.