అది చాలా కష్టం బాబోయ్ : వరుణ్ తేజ్…!

Venkatesh Dominated By Varun Tej In F2 Movie

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 అనే మల్టీ స్టారర్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటిస్తుండగా వీళ్ళ సరసన కథానాయకలుగా తమన్నా, మేహ్రిన్ నటిస్తున్నారు. ఈ చిత్రాని అనిల్ రావిపూడి కామెడీ ప్రధానంగా రూపొందించారు. ఈ చిత్రాని సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎఫ్2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ చిత్రం గురుంచి హీరో వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ….ఈ చిత్రంలో ప్రధానంగా కామెడీతో ముడి పడి ఉంటుంది.

వెంకటేష్ గారు ఆల్రెడీ ఇంతకు ముందు చాలా కామెడీ ప్రధాన సినిమాలో చేశారు. ఇక మరో యాక్టర్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకు కామెడీ వెన్నతో పెట్టిన విద్య అలాంటి వారితో నేను కామెడీ చెయ్యగలనాని మొదట భయం వేసింది కానీ అనిల్ నా బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా కామెడీ రాసుకొచ్చారు. తెలంగాణా యాస తో కూడిన కామెడీ నేను పండించాను. చాలా చక్కగా కామెడీ వచ్చింది. నాకు, వెంకటేష్ గారి మద్యలో వచ్చే కామెడీ సిన్స్ గాని, తమన్నా కు వెంకటేష్ కు మద్యలో వచ్చే వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న చిన్న ఫ్యామిలీ గొడవలు కానీ చాలా నచ్చే విధంగా ఉంటుంది. ఎఫ్2 చిత్రాని శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించాడు.