మరో బెల్లంకొండ ఎంట్రీ కి రంగం సిద్దం…!

Another Bellamkonda Hero To Get Launched

బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తన మొదటి సినిమా అల్లుడు శీను సినిమాతో ఆకట్టుకున్నాడు. కానీ ఆ తరువాత వచ్చిన సినిమాలు కమర్షియల్ పరంగా మాత్రం సాయి శ్రీనివాస్ వెనకనే ఉన్నాడు. ఆ మద్య వచ్చిన సాక్ష్యం సినిమాతో పర్వాలేదనిపించాడు. తాజాగా అయన నటించిన కవచం మూవీ మంచి విజయాని సాదించి పెట్టింది. కమర్షియల్ పరంగా మంచి కలెక్షన్స్ ను రాబట్టాడు. ముఖ్యంగా పోలీస్ పాత్రలో ఆకట్టుకున్నాడు.ఇంకా తరువాత తను నటించబోయే సినిమాల గురుంచి సరైనా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కమర్షియల్ పరంగా ఇకనుండి మంచి సినిమాలు చేస్తాను అంటున్నాడు.

తాజాగా బెల్లం కొండ ఫ్యామిలీ నుండి మరో హీరో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతనే బెల్లం కొండ గణేష్. సాయి శ్రీనివాస్ కు తమ్ముడు. ఇన్నాలు సినిమా నిర్మాణ బాధ్యతలు. అన్నయ్య కాల్షీట్స్ వ్యవహారాలు చూసుకునేవాడు. అన్నయ్య లగే తమ్ముడు కూడా సినిమా పైన ఇంటరెస్ట్ తో తెలుగులో కొత్త దర్శకుడు ఫణి తో ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఈ నెల 24 పూజ కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేస్తారు. మిగతా వివరాలు త్వరలోనే తెలుస్తాయి అంటున్నారు చిత్ర బృందం. మరి సాయి శ్రీనివాస్ లాగా మాస్ సినిమాలు చేస్తాడా లేక మంచి లవ్ అండ్ రొమాంటిక్ హీరో గా గుర్తింపు తెచ్చుకుంటాడ అనేది చూడాలి.