వర్మ వెన్నుపోటు సాంగ్ ఎలా ఉందంటే…!

Vennupotu-Full-Song

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మిస్ ఎన్టీఆర్ అనే బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ కు పోటిగా లక్ష్మిస్ ఎన్టీఆర్ ను రుపొందిస్తున్నాని వర్మ బహిర్గతంగా నే చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ లో చాలా వరకు పాజిటివ్ గానే చూపించవచ్చు. కానీ నా చిత్రంలో మాత్రం ఎన్టీఆర్ కు ఎవరు ఎవరు వెన్ను పోటు పొడిచారు అనేది నేను తప్పకుండ చూపిస్తాను. నిన్న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ చిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేశారు దానికి వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ నుండి ఓ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

ntr-bio-pic-laxmi

ఆ లిరికల్ సాంగ్ లో చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ వెన్ను పోటు అనే సాంగ్ ను విడుదల చేశారు. లక్ష్మిస్ ఎన్టీఆర్ కు కళ్యాణ్ మాలిక్ సంగితంను అందిస్తున్నారు. నిన్న విడుదలైన వెన్ను పోటు లిరికల్ సాంగ్ లో సంగీతం అంతగా ఆకట్టుకోలేదు కానీ వెన్ను పోటు … వెన్నుపోటు అంటూ సాగే సాంగ్ లిరికల్ మాత్రం చాలా బలంగా ఉన్నాయి. చంద్రబాబు, ఎన్టీఆర్, కొందరు ప్రముఖులు ఉన్న ఫొటోస్ తో ఈ లిరికల్ వీడియోను విడుదల చేశాడు. కళ్యాణ్ మాలిక్ సంగీతం మాత్రం అంతగా లేదు. గతంలో వర్మ చాలా మంచి మ్యూజిక్ డైరక్టర్స్ తో మంచి సంగీతంను అందించిన వర్మ ఈ సారి మాత్రం కళ్యాణ్ మాలిక్ తో నిరాశ పరిచాడు.